విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘నోటా’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ‘నోటా’ బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడినది.
ఈ చిత్రంకు ముందు విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన కారణంగా ‘నోటా’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌తో పాటు మంచి వసూళ్లు వస్తాయని అంతా ఊహించారు.కాని అనూహ్యంగా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది.
విజయ్ దేవరకొండకు ఇంత షార్ట్ గ్యాప్‌లో గీత గోవిందం తర్వాత ఫ్లాప్ వస్తుందని ఎవరు ఊహించలేదు.

‘గీత గోవిందం’ చిత్రం ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది, కాని ఇటీవల వచ్చిన నోటా మాత్రం వెళ్లిపోయేందుకు సిద్దం అయ్యింది.‘గీత గోవిందం’ చిత్రం మొదటి వారాంతంలో 31.65 కోట్ల వసూళ్లను సాధించింది.కేవలం నైజాం ఏరియాలోనే 8.7 కోట్లను విజయ్ దేవరకొండ రాబట్టాడు.కాని తాజాగా నోటా చిత్రం మాత్రం మొదటి వారాంతంలో కేవలం 11.5 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది.గీత గోవిందం చిత్రం కలెక్షన్స్‌కు నోటా కలెక్షన్స్‌కు చాలా తేడా ఉన్నాయి.సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కారణంగా రెండవ రోజు నుండే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

మొదటి రోజు తనకున్న క్రేజ్‌తో విజయ్ దేవరకొండ ‘నోటా’కు మంచి వసూళ్లను రాబట్టలేక పోయాడు.కాని దర్శకుడు ఆనంద్ శంకర్ మూస కథ, స్క్రీన్‌ప్లేతో చిత్రాన్ని తెరకెక్కించిన కారణంగా సినిమా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.దాంతో కలెక్షన్స్ ఈ రేంజ్లో దారుణంగా ఉన్నాయి.‘నోటా’ చిత్రాన్ని కేవలం 13 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.కనుక నిర్మాత సేఫ్ అంటూ సమాచారం అందుతుంది.ఈ చిత్రం మొత్తం లాభాలను తానే దక్కించుకోవాలనే ఉద్దేవ్యంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను అమ్మకుండా తనవద్దే ఉంచుకున్నాడు.
ఈ చిత్రంను కనుక జ్ఞానవేల్ రాజా అమ్మి ఉంటే ఖచ్చితంగా 30 కోట్లకు పైగా అమ్ముడు పోయేది.అప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 15 కోట్ల నష్టాు వచ్చేవి.
కాని నిర్మాత జ్ఞానవేల్ రాజాకు మాత్రం భారీగా లాభాలు దక్కేవి అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.