మనుసలుకు ఏదైనా హెల్త్ సమస్యల వస్తే ఎక్కడకు వెళ్తాం.హా ఇంకెక్కడకు హాస్పిటల్ కు వెళ్తాం అనే కదా మీ జవాబు.
అయితే మనుషులు తమకు కావాల్సినట్టే హాస్పిటళ్లను నిర్మించుకున్నారు సరే.మరి పక్షులకు ఏదైనా సమస్య వస్తే ఎలా దీనికి సమాధానం చెప్పేందుకు ఆలోచిస్తున్నారు కదా.
ఎందుకంటే పెట్ డాగ్స్ కు, పశువులకు సంబంధించిన హాస్పిటళ్లు ఉంటాయి.కానీ పక్షులకు హాస్పిటల్ ఏంటి అని షాక్ అయిపోకండి.
ఇప్పుడు మేం చెప్పేది వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు.తమిళనాడు రాష్ట్రంలో పక్షులకు కూడా ఓ హాస్పిటల్ ఉంది.
కోయంబత్తూర్ ప్రాంతం అంటే ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ ప్రాంతంలో పశ్చిమకనుమల్లో ఉన్న ఏరియాకు దేశ, విదేశాల నుంచి ఎన్నో రకాల పక్షలు వలస వస్తుంటాయి.ప్రకృతి రమణీయమైన ప్రాంతంలోకి పక్షులు రావడం చాలా కామన్.
అయితే ఇక్కడ కాలుష్య కోరలు పీక్స్ లెవల్ లో ఉండే సరికి వీటికి చాలా హాని చేస్తున్నాయట.ఈ ప్రాంతంలోకి ఎక్కువగా పర్యాటకులు వస్తుండటంతో వారంతా కూడా ప్లాస్టిక్ ను పెద్ద ఎత్తున వాడి పడేస్తున్నారంట.
దీంతో అది కాస్తా పక్షలకు మరణ శాసనంగా మారింది.

దీంతో అటవీ సిబ్బంది కొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది.స్థానికంగా ఉండే ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ఏకంగా పక్షుల కోసమే ప్రత్యేకంగా ఓహాస్పిటల్ ను ఏర్పాటు చేశారండోయ్.వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా ఇదే నిజం.
ఇక్కడ పక్షలకు కావాల్సినటువంటి అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయంట.గాయపడిన వాటిని ఇక్కడకు తీసుకువచ్చకి చికిత్స అందిస్తారు.
అయితే కేవలం తమ దగ్గర వాటికి మాత్రమే కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా సరే చికిత్స అందిస్తారు.ఇప్పటికే వేలాది పక్షలకు ఇక్కడ ట్రీట్ మెంట్ జరుగుతోంది.