బాలీవుడ్‌కు చెందిన అలనాటి హీరోయిన్ దేవికా రాణిని( Devika Rani ) భారతీయ సినిమా ప్రథమ మహిళ అని పిలుస్తారు.దేవికా రాణి 1908 మార్చి 30న విశాఖపట్నంలో జన్మించారు.
ఆమె కుటుంబం చాలా ధనవంతమైనది.దేవిక తండ్రి డాక్టర్, పెద్ద భూస్వామి.
ఆమె పూర్తి పేరు దేవికా రాణి చౌదరి.దేవిక 9 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లో చదువుకోవడానికి వెళ్లింది.
పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, దేవిక ఇంగ్లాండ్‌లోనే నటన మరియు సంగీతం కోర్సు చేసింది.దేవిక చాలా కళలలోనూ నిష్ణాతురాలు.
నటన తర్వాత ఆమె ఇంగ్లాండ్‌లోనే ఆర్ట్ డైరెక్షన్ మరియు కాస్ట్యూమ్ డిజైనింగ్ కోర్సులు కూడా చేసారు.దేవిక ఇంగ్లండ్‌లోనే ప్రముఖ దర్శక-నిర్మాత హిమాన్షు రాయ్‌ని కలిశారు.
ఆ రోజుల్లో ఎ త్రో ఆఫ్ డైస్ అనే సినిమా రూపొందుతోంది.దేవిక తొలి మీటింగ్‌లోనే హిమాన్షు రాయ్‌ని ఆకట్టుకుంది.
ఇద్దరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు.వీరు తరచూ కలుసుకోసాగారు.
మొదట స్నేహం ఏర్పడి ఆ తర్వాత ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు.ఇద్దరూ 1929లో పెళ్లి చేసుకున్నారు.
దేవిక కంటే హిమాన్షు 16 ఏళ్లు పెద్ద.పెళ్లి తర్వాత 1933లో ఇద్దరూ కర్మ అనే సినిమా చేశారు.
ఈ చిత్రంలో దేవిక హీరోయిన్ కాగా, హీరో హిమాన్షు.ఇద్దరూ 1934లో భారతదేశానికి తిరిగి వచ్చారు.
ఇద్దరూ ముంబైలో పెద్ద స్టూడియోను ప్రారంభించారు.బాంబే టాకీస్ అనే పేరు పెట్టారు దిలీప్ కుమార్, అశోక్ కుమార్ మరియు మధుబాల వంటి గొప్ప నటులను ఆవిష్కరించింది బాంబే టాకీస్( Bombay Talkies ).బాంబే టాకీస్ అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాణ పద్ధతులను భారతదేశానికి పరిచయం చేసిన స్టూడియో.

దేవికా రాయ్, ఆమె భర్త హిమాన్షు రాయ్( Himanshu Roy ) భారతీయ చిత్రాలను పాశ్చాత్య దేశాలతో సమానంగా తీసుకురావడానికి ఈ థియేటర్‌ని నిర్మించారు.1935లో విడుదలైన ‘జవానీ కి హవా’ ఈ బ్యానర్ తొలి చిత్రం.1936లో హిమాన్షు రాయ్ జీవన్ నయ్యా అనే సినిమా తీశారు.ఈ చిత్రంలో దేవిక నజ్ముల్ హసన్‌తో కలిసి నటించింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో దేవిక నజ్ముల్ హసన్‌తో ప్రేమలో పడింది.దేవిక తన భర్తను వదిలి అతనితో పాటు వెళ్లిపోయింది.ఇక్కడి నుంచే హిమాన్షు, దేవికల మధ్య అనుబంధం చెడింది.
కొన్ని షరతుల తర్వాత, ఆమె హిమాన్షు వద్దకు తిరిగి వచ్చింది.భర్త మరణించే వరకు అతనితోనే ఉంది.
దేవిక మార్చి 9, 1994న తన 85వ ఏట తుది శ్వాస విడిచింది.దేవికా రాణి అనేక ప్రతిష్టాత్మక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులతో సత్కారం పొందారు.1958లో భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.ఆమెకు 1970లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.1981లో ఇండియన్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్, ఆర్ట్ అండ్ సైన్స్ నుండి పతకాన్ని అందుకున్నారు.