ఇటువంటి గూగుల్ టూల్స్ వున్నాయన్న సంగతి మీకు ఎరుకేనా?

ఇక్కడ గూగుల్( Google ) వాడని మనిషి ఉండరంటే అతిశయోక్తి కాదేమో.గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు.

మ్యాప్స్ నుంచి పేమెంట్స్ వరకూ.న్యూస్ నుంచి ట్రాన్స్‌లేషన్ వరకూ గూగుల్ చేయని పనంటూ లేదని మనలో చాలామందికి తెలుసు.

మొబైల్( Mobile ) వాడే ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్ ఒక భాగమైపోయింది.అయితే గూగుల్‌కి సంబంధించి సుమారు 70కి పైగా టూల్స్ ఉన్నాయని చాలా తక్కువమందికి తెలుసు.

ఇపుడు వాటిలో కొన్నింటి గురించైనా ఇక్కడ తెలుసుకుందాము.

Advertisement

మనకి మొదట షాపింగ్ అనగానే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటివే గుర్తొస్తాయి.గూగుల్ ఎక్స్‌ప్రెస్ లేదా గూగుల్ షాపింగ్ టూల్స్( Google Shopping Tools ) ద్వారా కూడా రకరకాల ప్రొడక్ట్స్ షాపింగ్ చేయొచ్చని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇది డైరెక్ట్ ఇ-కామర్స్ టూల్ మాత్రం కాదు.ఇందులో రకరకాల ప్రొడక్ట్స్‌కు సంబంధించి ఏ ప్రొడక్ట్ ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది? ఏయే స్టోర్స్, ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది? అన్న వివరాలు తెలుసుకోవచ్చు.ఆ తరువాత మనం ఏదైనా విషయంపై లోతుగా రీసెర్చ్ చేయాలని అనుకున్నపుడు గూగుల్ స్కాలర్ టూల్ చాలా సహకరిస్తుంది.

ఇందులో రకరకాల అంశాలపై చేసిన రీసెర్చ్ వివరాలు, ఆర్టికల్స్, బుక్స్, పబ్లికేషన్స్, కోర్ట్ జడ్జిమెంట్స్, ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్స్ లాంటివి ఉంటాయి.

అంతేకాకుండా మనం ఏదైనా సాంగ్ విన్నపుడు ఆ మ్యూజిక్ ఎందులోదో తెలుసుకోవాలి అనిపిస్తుంది.అలాంటప్పుడు గూగుల్ సౌండ్ సెర్చ్( Google Sound Search ) అనే టూల్ ద్వారా సెర్చ్ చేస్తే.ఆయా వివరాలు వెంటనే తెలిసిపోతాయి.

ఇక ఉద్యోగాలు చేసేవాళ్లు లేదా బిజినెస్ చేసేవాళ్లు తమ కెరీర్‌ బూస్ట్ చేసుకోవాలంటే కొత్తగా వస్తున్న డిజిటల్ స్కిల్స్‌ నేర్చుకోక తప్పదు.దానికోసం గుగూల్ డిజిటల్ గ్యారేజ్‌ను ఇకటి ఫ్రీగా అందిస్తోందని మీలో ఎంతమందికి తెలుసు? ఓల్స్ గూగుల్ ఎక్స్‌పెడిషన్స్ టూల్ ద్వారా ప్రపంచంలోని రకరకాల హిస్టారికల్ ప్లేసులను, నేషనల్ పార్కులను వర్చువల్‌గా విజిట్ చేయొచ్చు.బిజినెస్ చేసేవాళ్లు, స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు గూగుల్ ఫైనాన్స్ టూల్ ద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్‌ తెలుసుకోవచ్చు.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు