డిసెంబర్ 22వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సలార్ సినిమా( Salaar movie ) గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి వస్తుంది అంటూ ఈ సినిమా డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్( Prashanth Neil ) ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
ఇక దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీదనే ప్రతి ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

ఇక ముఖ్యంగా ప్రభాస్ కి బాహుబలి 2 తర్వాత ఒక్క సక్సెస్ సినిమా కూడా రాలేదు.బాహుబలి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది.ఇక అప్పటి నుంచి ఇప్పటికీ వరకు ఒక్క సక్సెస్ కూడా రాకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దాంతో ఈ సినిమా హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన విశాల్ వాళ్ల వదిన శ్రీయ రెడ్డి ( Shriya Reddy )ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి సంబంధించిన విషయాలను కూడా మనం ట్రైలర్ ని అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది.ఒక పవర్ఫుల్ లేడి గెటప్ లో సారీ కట్టుకొని రాజసం ఉట్టిపడేటట్టు గా చాలా గర్వంగా నడుచుకుంటూ వస్తూ ట్రైలర్ లో మనకు కనిపిస్తుంది.

అయితే ఈమె ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు గా మనకు తెలుస్తుంది.2002 వ సంవత్సరం నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తుంది.అలాగే విశాల్ వాళ్ల అన్నయ్య అయిన విక్రమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం ఈమె వయసు 40 సంవత్సరాలు అయిన కూడా ఇప్పటికీ ఈమె సినిమాల్లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.








