Krishna Section 144 : కృష్ణ నటించిన ఆ సినిమాకు 144 సెక్షన్ విధించారనీ తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి కౌబాయ్ జేమ్స్ బాండ్ అల్లూరి సీతారామరాజువంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి మాత్రమే ఉంది.ఇలా ఎన్నో ధైర్య సాహసాలు ఉన్నటువంటి సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ గారు నేడు తుది శ్వాస విడిచారు.

 Did You Know That Section 144 Was Imposed For That Movie Starring Krishna , Sec-TeluguStop.com

ఇలా ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఈ విధంగా తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇక కృష్ణ నటించిన సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలలో సింహాసనం ఒకటి.ఈ సినిమా ప్రస్తుతం బాహుబలి సినిమా స్థాయిలో అప్పట్లో రికార్డులు సృష్టించింది.ఈ సినిమా విడుదల తరువాత టికెట్ల కోసం థియేటర్ల ముందు12 కిలోమీటర్ల దూరం వరకు జనాలు క్యు కట్టారంటే ఈ సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డులను సృష్టించిందో మనకు అర్థమవుతుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలై రాజ్ థియేటర్ ముందు ఉన్న వీధి మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది.

దీంతో పోలీసులు ఈ వీధిలో ఏకంగా 144 సెక్షన్ విధించారు.

Telugu Krishna, Raj Theatre, Simhasanam, Tollywood-Movie

ఈ వీధిలో నడవాలంటే సినిమా టికెట్ చూపిస్తేనే వారిని మాత్రమే రోడ్డుపై వెళ్లనిచ్చేవారని ఒకానొక సమయంలో కృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇలాంటి అద్భుతమైన రికార్డులను సృష్టించిన తెలుగు మొదటి ఆఖరి చిత్రం సింహాసనం అని చెప్పాలి.1986లో విడుదలైన ఈ సినిమా కేవలం 53 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకుంది.అప్పట్లో ఈ సినిమాకు ఏకంగా మూడు కోట్ల 50 లక్షల బడ్జెట్ కేటాయించి నిర్మించారు.ఇలా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులను సృష్టించింది.

కృష్ణ గారి సినీ కెరియర్లో సింహాసనం సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube