సముద్రంలో చేపల వేట అంటే మత్స్యకారులకు ఒక సవాల్ లాంటింది అనే చెప్పాలి.ఎందుకంటే చేపలు పడితేనే వాళ్ళకి జీవనాదారం దొరుకుతుంది.
అయితే సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల వలలో చేపలు పడడం సహజమే.కానీ ఒక్కోసారి వలలో మాములు చేపల మాదిరిగానే కొన్ని అరుదైన చేపలు కూడా వలలో చిక్కుతుంటాయి.
అలాంటి అరుదైన చేపలు వలలో చిక్కినప్పుడు ఆ మత్స్యాకారులకు ఆ రోజు పండగే.ఎందుకంటే అరుదైన చేపలు మత్స్యకారులకు చిక్కితే వాటి ధర బాగా పలుకుతుంది.
అయితే ఒక్కోసారి వేటకు వెళ్లిన మత్స్యకారులకు శ్రమకు తగిన ఫలితం కూడా దక్కదు.అలాంటిది వాళ్లకు ఆ ఒక్క చేప కనుక వలకు దొరికితే వారికి అదృష్టం పట్టినట్లే అని చెప్పవచ్చు.
ఎందుకంటే ఆ చేప దొరికితే గోల్డ్ దొరికినంత ఆనందం వ్యక్తం చేస్తారు మత్స్యకారులు.ఇంతకీ ఆ చేప పేరేంటో తెలుసా.
గోల్డెన్ ఫిష్.అలాగే ఈ చెపకు మరొక పేరు కూడా ఉందండోయ్.
దీనిని కచ్చిడి చేప అని కూడా అంటారు.ఏంటి ఎక్కడో ఈ కచ్చడి చేప పేరు విన్నట్టు అనిపిస్తుంది కదా.ఈ మధ్య కాలంలో ఈ చేప పేరు జనాల నోళ్లలో బాగా వినిపిస్తుంది.ఎందుకు అంటే ఈ చేపకు పలికే ధర వలన ఈ చేప ప్రత్యేకత ఏంటంటే.
ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది.ఆ కచ్చిడి చేప ధర కూడా ఏకంగా లక్షల్లో ఉంటుంది.
ముఖ్యంగా కచ్చడి మగ చేపకు డిమాండ్ బాగా ఉంటుంది.ఈ చేప జాలర్లకు చిక్కితే మాత్రం దానిని కొనడానికి వ్యాపారులు క్యూ కడతారు అంటే నమ్మండి.

ఈ కచ్చిడి చేప ప్రత్యేకత ఏంటంటే.దీని పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట.అందుకే ఈ చేపకు అంత రేటని వ్యాపారాలు చెబుతారు.అలాగే ఏదైనా సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని కూడా ఈ చేప గాల్ బ్లాడర్‌తోనే తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
అంతేనా ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ ఫిష్‌ను ఉపయోగిస్తున్నారు.తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద ఇలాంటి చేప ఒకటి వలలో చిక్కింది.28 కేజీలు బరువున్న మగ గోల్డెన్ ఫిష్ మత్స్యకారుల వలకు చిక్కింది.కాగా ఈ చేపను పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఒక వ్యాపారి ఏకంగా 2 లక్షల 90 వేల రూపాయలకు సొంతం చేసుకున్నాడు.







