ప్రపంచంలోని 50 సంపన్న నగరాలలో 10 యూఎస్‌లోనే ఉన్నాయని మీకు తెలుసా?

మీరు విన్నది నిజమే.అందుకే అది ప్రపంచ దేశాలకు పెద్దన్న అయి కూర్చుంది మరి.

ఇక విషయంలోకి వెళితే, యూఎస్ అత్యధిక సంపన్న నగరాలతో చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలను సైతం అధిగమించింది.ఒక సంస్థ చేపట్టిన తాజా సర్వేలో ఈ విషయం బయటపడింది.

ఏ దేశంలో లేని అత్యంత సంపన్న నగరాలు అమెరికాలోనే ఇపుడు ఉన్నాయి.ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ ప్రకారం, ప్రపంచంలోని ఏ నగరంలో లేని అత్యధిక మిలియనీర్లు న్యూయార్క్‌లోనే ఉన్నారట.గత సంవత్సరం ఈ నగరంలో దాదాపు 3.4 లక్షల మంది మిలియనీర్లు ఉన్నట్లు తెలిసింది.దాంతో న్యూయార్క్( New York ) అత్యంత సంపన్న నగరంగా అవతరించింది.

ఇక ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల్లో న్యూయార్క్ తర్వాతి స్థానాల్లో వున్నవి చూసుకుంటే టోక్యో, కాలిఫోర్నియా బే ఏరియా, లండన్, సింగపూర్( Tokyo, California Bay Area, London, Singapore ) వరుసగా వున్నాయి.హెన్లీ & పార్ట్‌నర్స్ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లోని 97 నగరాలను పరిశీలించడం జరిగింది.అంటే యూఎస్ తర్వాత చైనా, ఆస్ట్రేలియాలదే పైచేయిగా కనబడుతోంది.2012-2022 మధ్య కాలంలో అధిక నికర విలువ గల వ్యక్తుల సంఖ్య 40% పెరగడంతో న్యూయార్క్ నగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా మారింది.

Advertisement

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు వున్న నగరంగా కాలిఫోర్నియా బే ఏరియా రికార్డు సాధించింది.ఈ కోటీశ్వరులలో 63 మంది ఈ నగరంలోని సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో చుట్టూ ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సర్వే ప్రకారం, ప్రపంచంలోని అన్ని నగరాల కంటే బే ఏరియాలోనే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నారని భోగట్టా.

ఆ తర్వాత న్యూయార్క్, బీజింగ్, లాస్ ఏంజిల్స్, షాంఘై నగరాల్లోనూ అత్యధిక బిలియనీర్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు