రానా నాయుడు వెబ్ సీరీస్ తో దగ్గుబాటి హీరోలు ఇద్దరు సూపర్ షాక్ ఇచ్చారు.వెంకటేష్ లాంటి క్లాస్ అండ్ ఎంటర్టైనింగ్ హీరోని పక్కా రోగ్ గా చూపించారు రానా నాయుడు మేకర్స్.
ఈ వెబ్ సీరీస్ కి వారు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారేమో కానీ వెంకటేష్ ఫ్యాన్స్ మాత్రం రానా నాయుడిని యాక్సెప్ట్ చేయలేకపోయారు.అయితే నార్త్ ఆడియన్స్ కి మాత్రం ఈ వెబ్ సీరీస్ బాగా నచ్చింది.
నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ తెరకెక్కించిన ఈ సీరీస్ మిలియన్ల కొద్దీ వాచ్ అవర్స్ తెచ్చుకుంది.
ఇక రానా నాయుడు సీజన్ 1 లాస్ట్ మంత్ రిలీజ్ అవగా లేటెస్ట్ గా సీజన్ 2 కూడా రాబోతుందని ఎనౌన్స్ చేశారు.అయితే సీజన్ 1లో బూతులు, బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందని అనిపించగా సీజన్ 2 లో అది మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.రానా నాయుడు సీజన్ 2 మరింత బోల్డ్ గా ఇంకాస్తా ఎక్కువ బూతులు ఉంటాయని తెలుస్తుంది.
రానా నాయుడు సీజన్ 1 చూసే తెలుగు ఆడియన్స్ బాబోయ్ అనగా సీజన్ 2 ఇంకా ఎక్కువ బోల్డ్ కంటెంట్ అంటున్నారంటే అదెలా ఉంటుందో చూడాలి.రెండు సీజన్లకు కలిపి ఒకేసారి షూటింగ్ చేయగా సీజన్ 2ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.