ఈ స్లీపింగ్ బ‌స్సు గురించి మీకు తెలుసా..

అల‌సట వ‌చ్చిన‌ప్పుడే మ‌న‌కు విశ్రాంతి గుర్తుకు వ‌స్తుంది.నిజానికి ప్ర‌స్తుత రోజుల్లో విశ్రాంతి అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది.

ఎందుకంటే మ‌న‌మున్న బిజీలో మ‌న‌కు క‌నీసం రెస్ట్ తీసుకోవ‌డానికి కూడా అస‌లు వెస‌లు బాటు అనేది దొర‌క‌ట్లేదు.నిత్యం మ‌న జీవితంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు, ప‌ని ఒత్తిడి లాంటి వాటితో క‌నీసం ప‌డుకోవ‌డం అనే విష‌యం కూడా మ‌న‌కు పెద్ద స‌వాలుగా మారిపోయింది.

ఈ త‌రుణంలోనే మ‌న‌కు బ‌స్సులో వెళ్తే గ‌న‌క ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది క‌దా.ఎందుకంటే ఈ బ‌స్సుల్లో వెళ్తే చ‌ల్ల‌టి గాలికి ఈజీగా నిద్ర ప‌ట్టేస్తుంది.

పట్టదు.అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.

Advertisement

మ‌న‌కు కిటికీ ప‌క్క‌న కూర్చుంటే చాలు ఇట్టే నిద్ర ప‌ట్టేస్తుంది క‌దా.ఎందుకంటే ప‌క్క నుంచి హాయిగా చ‌ల్ల‌గాలి వ‌స్తుంటే మ‌న‌కు ఆ హాయికే చ‌క్క‌గా నిద్ర ప‌ట్టేస్తుంది.

అయితే ఇప్పుడు మ‌నం ఓస్లీపింగ్ బ‌స్సు గురించి మాట్లాడుకుందాం.ఈ బ‌స్సులో ప్ర‌త్యేకించి ప‌డుకోవ‌డానికే స్లీపింగ్ సీట్లు కూడా ఉంటాయ‌ట‌.

ఇందులో హాయిగా ఎలాంటి టెన్ష‌న్లు లేకుండా ప‌డుకోవ్చ‌న్న‌మాట‌.అయితే ఈ స్లీపింగ్ బ‌స్సు హాంకాంగ్ దేశానికి చెందిన ఓ ప్ర‌యివేటు ట్రావెల్స్ కంపెనీ ప్ర‌వేశ పెట్టింది.

దీని ప్ర‌త్యేకత ఏంటంటే ఎవ‌రైతే ఇంట్లో ఇబ్బందులు ప‌డుతూ టెన్ష‌న్ల‌కు నిద్ర పట్టక ఇబ్బంది ప‌డుతుంటారో వారంతా కూడా ఈ బస్సులో హాయిగా నిద్రపోవ‌డానికి ఛాన్స్ ఉంటుందంట‌.దాదాపు ఐదు గంటల వ‌ర‌కు ఇందులో హాయిగా నిద్రపోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది.డబుల్‌ డెక్కర్ బస్సుల్లో దాదాపు 75 కిలో మీట‌ర్ల దాకా ఎక్క‌డా ఆగ‌కుండా తిరుగుతూనే ఉంటుంది.ఎందుకంటే క‌స్ట‌మ‌ర్ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఇలా ప్లాన్ చేశారు.13 నుంచి 51 డాలర్ల దాకా ఈ స్లీపింగ్ బ‌స్సులో టికెట్ రేట్లు ఉంటాయ‌ని చెబుతున్నారు.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు