అప్పుడే డోసు పెంచేశారా బాసూ

డా” రా కదిలి రా ‘ ‘ సిద్ధం ‘ ఇలా రకరకాల పేర్లతో టిడిపి,  వైసిపిలు( TDP, YCP ) ఎన్నికల కథనరంగంలోకి దిగిపోయాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్పీడ్ పెంచాయి.

 Did You Just Increase The Dose Basu, Ysrcp, Tdp, Janasena, Congress, Ap Election-TeluguStop.com

ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించకుండానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయాయి.ప్రజలను ఆకట్టుకునే విధంగా భారీగా సభలు , సమావేశాలు, నిర్వహిస్తూ ఆయా పార్టీల అధినేతలు,  కీలక నాయకులంతా జనాల బాట పడుతున్నారు.

మళ్లీ తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని,  ఎక్కడా తాము అవినీతి , అక్రమాలకు పాల్పడకుండా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నామని , గత టిడిపి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి , ప్రస్తుత అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుని మళ్లీ తమకు అధికారం కట్టబెట్టాలని వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ప్రసంగాలు చేస్తుండగా , టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) అంతే స్థాయిలో స్పీడ్ పెంచారు.

Telugu Ap, Chandrababu, Congress, Janasena, Pavan Kalyan, Sharmila, Ys Jagan, Ys

గత పది రోజులుగా చంద్రబాబు ప్రత్యేక హెలికాఫ్టర్ ను అద్దెకు తీసుకుని మరీ జనాల్లోకి వెళ్తున్నారు .భారీగా జన సమీకరణ చేపట్టి మరీ సభలను నిర్వహిస్తున్నారు.ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకుండానే చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉండడం, ప్రస్తుత అధికార పార్టీ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే విధంగా అనేక హామీలను ఇస్తూ చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశారు.

ఇక అధికార పార్టీ వైసిపి నిన్న భీమిలిలో( Bhimili ) సిద్ధం.పేరుతో పార్టీ కార్యకర్తలతో భారీగా సమావేశాన్ని నిర్వహించింది .ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలి వచ్చారు.

Telugu Ap, Chandrababu, Congress, Janasena, Pavan Kalyan, Sharmila, Ys Jagan, Ys

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజలను ఆకట్టుకునే విధంగా జగన్ ప్రసంగం చేశారు.ప్రతి కార్యకర్త ఒక స్టార్ క్యాంపైనర్ గా  మారి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించాలని జగన్ పిలుపునిచ్చారు.ఒకవైపు చంద్రబాబు , మరోవైపు జగన్ రాజకీయ పర్యటనలు విస్తృతంగా చేపడుతుండగా,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు.

ఇక కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు నియమితులైన షర్మిల సైతం జిల్లాల పర్యటనలు చేపడుతూ వైసిపి ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో బిజెపి బాగా వెనుకబడినట్టుగానే కనిపిస్తుంది.

టిడిపి,  వైసిపిలు ఈ స్థాయిలో స్పీడ్ పెంచడానికి కారణం వచ్చే నెల 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేలడంతోనే ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టి , ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఆయా పార్టీల అధినేతలు రంగంలోకి దిగిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube