Balakrishna : బాలకృష్ణ కెరియర్ లో ఈ రెండు సినిమాలు చాలా కీలక పాత్ర వహించాయా..?

బాలకృష్ణ ( Balakrishna ) లాంటి మాస్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడం సహజం.ఇక ఆయన సినిమాలు రిలీజ్ అయి వాళ్ళ అంచనాలను మించి సూపర్ సక్సెస్ లు అవ్వడం కూడా మనం చాలా సందర్భాల్లో చూశాం… ఇక బాలకృష్ణ ఎంటైర్ కెరీయర్ లో ఒక రెండు సినిమాలు మాత్రం ఆయనకి వెరీ స్పెషల్ సినిమాలనే చెప్పాలి.అందులో సమరసింహారెడ్డి ఒకటైతే, సింహా మరొకటి…

 Did These Two Films Play A Very Important Role In Balakrishna Career-TeluguStop.com

బి గోపాల్ దర్శకత్వం లో వచ్చిన సమరసింహారెడ్డి( Samarasimha Reddy Movie ) సినిమాకి ముందు బాలకృష్ణ కి వరుసగా ప్లాప్ సినిమాలు వచ్చాయి.దాంతో బాలకృష్ణ మార్కెట్ భారీగా డౌన్ అయింది.ఇక ఇలాంటి సందర్భంలో ఫ్యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా హిట్టు కొట్టడమే కాకుండా బాలకృష్ణను టాప్ హీరో రేస్ లో నిలబెట్టింది.ఇక ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని ఎవరు ఆపలేదని చెప్పాలి.

ఇక ఈ సినిమాకి పోటీగా వచ్చిన చిరంజీవి స్నేహం కోసం సినిమాని కూడా డామినేట్ చేస్తూ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ కి దాదాపు 2003 నుంచి 2009 వరకు సరైన సక్సెస్ అయితే లేదు.

ఇలాంటి సమయంలోనే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తీసిన సింహ సినిమాతో( Simha Movie ) బాలకృష్ణ సూపర్ సక్సెస్ ను అందుకొని లైమ్ లైట్ లోకి వచ్చాడు…ఇక అప్పటినుంచి వెనుతిరిగి చూడకుండా వరుసగా మంచి విజయాలను సాధిస్తు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ముందుకెళ్తున్నాడు.ఇక సీనియర్ హీరోల్లో బాలకృష్ణ ప్రస్తుతం టాప్ పోజిషన్ లో కొనసాగుతున్నాడనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఆయన వరుసగా రెండు మూడు సినిమాలు కమిటై వాటిని చేసే పనిలోనే ప్రస్తుతం బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube