Nijam : ఆ ఒక్క తప్పు వల్లే నిజం సినిమా ప్లాప్ అయిందా..? దానికి కారణం ఎవరు..?

సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలో మంచి సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఒక గొప్ప గుర్తింపు ను సంపాదించుకున్నాడు.ఇక అందులో భాగంగానే మహేష్ బాబు కెరీయర్ మొదట్లో తేజ( Teja ) డైరెక్షన్ చేసిన ‘నిజం ‘ సినిమా( Nijam ) మంచి విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు.

 Did The Movie Flop Because Of That One Mistake Who Is The Reason For That-TeluguStop.com

కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది.దానికి కారణం ఏంటి అంటే మహేష్ బాబు ఈ సినిమాలో పోషించిన క్యారెక్టర్ అతనికి చాలా పెద్ద మైనస్ గా మారిందనే చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు( Mahesh Babu ) ప్రతిదానికి భయపడుతూ ఒక పిరికివాడి క్యారెక్టర్ ని పోషించాడు.అలాంటి ఒక స్ట్రైచర్ ఉన్న ఒక హీరో పిరికివాడిగా నటించడాన్ని తన అభిమానులు గానీ, ప్రేక్షకులు గానీ జీర్ణించుకోలేకపోయారు.దానివల్లే ఈ సినిమా అనేది డిజాస్టర్ అయింది.ఇక ఈ సినిమా వచ్చే సమయానికి ఇంద్ర, ఆది, సింహాద్రి లాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవడం అలాగే మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి.

ఇక దాంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే కథలకి ఎక్కువ స్కోప్ ఉండేది.ఈ సినిమా మాత్రం కంటెంట్ బేస్డ్ గా నడిచే సినిమా కావడంవల్ల అది కూడా మహేష్ బాబు మీద తీయడం వల్ల ఈ సినిమా అనేది ఫ్లాప్ అయింది.తేజ ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు.ఈ సినిమాను వేరే కొత్త హీరోతో చేసి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడ్డారు.ఒకవేళ మహేష్ బాబును పెట్టి తీసిన కూడా దాంట్లో కొన్ని హై ఫీల్ ఇచ్చే ఎలివేషన్స్ ను కూడా యాడ్ చేసుంటే బాగుండేదని పలువురు సినీ మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube