Snehareddy : స్నేహారెడ్డితో పెళ్లి కోసం అల్లు అర్జున్ అలాంటి త్యాగం చేశారా.. నిజమైన ప్రేమ అంటూ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్చి ఆరవ తేదీ తన 13వ పెళ్లిరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 Did Snehareddy Agree To Marry Bunny After That Sacrifice-TeluguStop.com

ఇలా వీరిద్దరి వివాహం 2011 వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.అల్లు అర్జున్( Allu Arjun ) స్నేహారెడ్డిని ( Sneha Reddy ) మొదటిసారి ఒక నైట్ పార్టీలో చూశారట సాధారణంగా నైట్ పార్టీలో అమ్మాయిలు కనుక ఉంటే వారిపై ఒక విధమైనటువంటి ఒపీనియన్ ఉంటుంది కానీ స్నేహ రెడ్డిని చూడగానే అల్లు అర్జున్ ప్రేమలో పడ్డారట.

స్నేహ రెడ్డి నైట్ పార్టీకి వచ్చినప్పటికీ అక్కడ చాలా పద్ధతిగా నడుచుకున్నారని ఆ పద్ధతికి అల్లు అర్జున్ పడిపోయారని పలు సందర్భాలలో ఈయన తన ప్రేమ గురించి తెలియజేశారు.అయితే తాజాగా వీరి పెళ్లి రోజు కావడంతో అల్లు అర్జున్ పెళ్లికి సంబంధించినటువంటి ఒక వార్త వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె ఈయన ప్రేమకు ఎస్ చెప్పడానికి కాస్త ఆలోచించారట.

Telugu Allu Arjun, Sneha Bunny, Sneha-Movie

అల్లు అర్జున్ ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి స్నేహ రెడ్డి మొదటి ఆలోచనగా ఆయన హీరో తాను సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయి కనుక ఆ విషయంలో ఆలోచించారట అంతేకాకుండా అల్లు అర్జున్ కు అలవాటు కూడా ఉంది ఈయన ఇతరులపై సెటైర్లు వేయడం ముఖ్యంగా అమ్మాయిలను తన మాటలతో ఆటపట్టించడం వంటివి చేస్తుంటారు కానీ స్నేహ రెడ్డికి అలాంటివి ఏమాత్రం ఇష్టం ఉండవట.

Telugu Allu Arjun, Sneha Bunny, Sneha-Movie

ఈ విధంగా అల్లు అర్జున్ ప్రపోజ్ చేయడంతో తన గురించి అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకున్న తరువాతనే ఈమె అల్లు అర్జున్ కి ఒక కండిషన్ పెట్టారట ఈ కండిషన్ కి కనక తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తెలిపారట.మరి అల్లు అర్జున్ స్నేహాను పెళ్లి చేసుకోవడం కోసం ఎలాంటి కండిషన్ కి ఒప్పుకున్నారనే విషయానికి వస్తే.తనని పెళ్లి చేసుకోవాలంటే ఇప్పటిలాగా అమ్మాయిల మీద సెటైర్లు వేయడం వారిపై కామెంట్స్ చేయడం, అమ్మాయిలని ఏడిపించడం( Making comments , making girls cry ),ఆట పట్టించడం లాంటివి చేయకూడదు వీటన్నింటిని మానుకోవాలని కండిషన్ పెట్టారట .ఇలా స్నేహారెడ్డి కండిషన్ లు పెట్టడంతో ఆమె ప్రేమ కోసం అల్లు అర్జున్ ఈ అలవాట్లు అన్ని మానుకున్నారని తెలుస్తోంది.ఇలా అల్లు అర్జున్ ఇలాంటి కండిషన్లకు ఒప్పుకొని మరి స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు అంటే బన్నీది నిజమైన ప్రేమ అంటూ అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube