వరుణ్ తేజ్ కి ముందు లావణ్య త్రిపాఠి ఆ హీరోని అంతలా ప్రేమించిందా?

Did Lavanya Tripathi Love That Hero So Much Before Varun Tej? , Mister , Lavanya Tripathi , Vaishnav Tej , Sai Dharam Tej , Varun Tej , Tollywood, Social Media

మెగా అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూసిన వరుణ్ తేజ్( Varun Tej ) మరియు లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.నిన్ననే వీళ్లిద్దరు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా నిచితార్థం చేసుకున్నారు.

 Did Lavanya Tripathi Love That Hero So Much Before Varun Tej? , Mister , Lavanya-TeluguStop.com

సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసిన ఈ క్యూట్ జంటకి సంబంధించిన నిశ్చితార్ధ ఫొటోలే కనిపిస్తున్నాయి.మెగా కుటుంబ హీరోలందరినీ ఒకే చోట చూసేలోపు ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది.

ఈ నిశ్చితార్ధ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఆకర్షణగా నిలిచాడు.ఆయనకీ సంబంధించిన ఫోటోలు బయటకి రాగానే సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది.

రామ్ చరణ్ , అల్లు అర్జున్, చిరంజీవి, అల్లు శిరీష్,సాయి ధరమ్ తేజ్ మరియు పంజా వైష్ణవ్ తేజ్ తదితరులు ఈ నిశ్చితార్ధ మహోత్సవం లో పాల్గొని సంబరాలు చేశారు.

Telugu Mister, Sai Dharam Tej, Tollywood, Vaishnav Tej, Varun Tej-Telugu Top Pos

ఇదంతా పక్కన పెడితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ ఎక్కడి నుండి మొదలైందో మన అందరికీ తెలిసిందే.వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘మిస్టర్‘ సినిమాకి ముందు నుండే వీళిద్దరి మధ్య మంచి పరిచయం ఉంది.వరుణ్ తేజ్ మరియు నిహారికలతో కలిసి లావణ్య త్రిపాఠి ఒకే జిమ్ కి వెళ్లేవారు.

అక్కడే మొట్టమొదటి సారి వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.ఆ తర్వాత ఇద్దరు కలిసి ‘మిస్టర్’( Mister ) సినిమాలో పని చెయ్యడం వల్ల వాళ్ళ మధ్య ఉన్న బంధం మరింత బలపడి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారేలాగా చేసింది.

ఆ తర్వాత ఇద్దరి మనసులు బాగా దగ్గరవ్వడం తో ప్రేమించుకోవడం మొదలెట్టారు.సుమారుగా 7 ఏళ్ళ వరకు ప్రేమించుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు మూడు ముళ్ల బంధం తో ఒకటి కాబోతున్నారు.

అయితే లావణ్య త్రిపాఠి గతం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ ని పొగుడుతూ వరుణ్ తేజ్ ని తగ్గిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Telugu Mister, Sai Dharam Tej, Tollywood, Vaishnav Tej, Varun Tej-Telugu Top Pos

యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ లో మీకు బాగా నచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎవరు ది బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అని మీరు అనుకుంటున్నారు అని లావణ్య త్రిపాఠి ని అడగగా, ఆమె క్షణం కూడా ఆలోచించకుండా సాయి ధరమ్ తేజ్ పేరు చెప్పింది.సాయి ధరమ్ తేజ్ చాలా మంచోడు అని, ఏ అమ్మాయి అయినా అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందని, అలా అని వరుణ్ తేజ్ మంచోడు కాదు అని చెప్పను కానీ, సాయి ధరమ్ తేజ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ది బెస్ట్ అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురయ్యారు.

మీరిద్దరూ గతం లో ప్రేమించుకొని విడిపోయారా? అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube