దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా వెలిగినటువంటి వారిలో నటి పూజా హెగ్డే ( Pooja Hedge ) ఒకరు.
హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈమె కెరియర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
అనంతరం ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఈ విధంగా పూజా హెగ్డే కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి పూజా హెగ్డే సినీ కెరియర్ ప్రస్తుతం కాస్త ఇబ్బందులలో ఉందని చెప్పాలి.
పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అవుతున్నాయి.దీంతో ఈమెకు అవకాశాలు కూడా కాస్త కరువయ్యాయని చెప్పాలి.వచ్చినవి కూడా ఎక్కువ కాలం నిలబడలేక పోతుంది పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఈమెకు చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social media ) కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు.
ఇక పూజ హెగ్డే ఇలాగే కనుక ఉంటే తన సినీ కెరియర్ ఇక్కడితో ముగుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.అయితే తిరిగి తాను ఇండస్ట్రీలో బిజీ కావాలి అంటే తనకు ఒక మంచి సినిమా అవకాశం వచ్చి ఆ సినిమా మంచి సక్సెస్ అయితేనే తనకు సినీ కెరియర్ ఉంటుందని లేకపోతే తన సినీ కెరీర్ ఇంతటితో ముగుస్తుంది.
ఇలా హీరోయిన్ గా ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈమెకు మరొక నటి ఉచిత సలహా ఇచ్చారట ఆ హీరోయిన్ ఇచ్చిన సలహా గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో పూజ హెగ్డే అభిమానులు తీవ్ర స్థాయిలో ఆ హీరోయిన్ పై మండిపడుతున్నారు.ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ సినిమా అవకాశాలు లేకపోతే వెబ్ సిరీస్ ( Web Series ) లలో నటిస్తూ మరోసారి సినిమా అవకాశాలను అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇలియానాకు చాలా స్నేహితుడు అయినటువంటి ఒక డైరెక్టర్ పూజా హెగ్డేకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కల్పించారట అయితే ఈ వెబ్ సిరీస్ మొత్తం రొమాంటిక్ బోల్డ్ సన్నివేశాలతో కూడుకొని ఉందట.
ఈ సిరీస్ కథ విన్నటువంటి పూజా హెగ్డే తాను ఇలాంటి సిరీస్లో అసలు చేయనని చెప్పేసారట కానీ ఆ డైరెక్టర్ ఇలియానాకు మంచి ఫ్రెండ్ కావడంతో ఇలియానా( Ileana ) కూడా ఈ వెబ్ సిరీస్ లో చేస్తే అవకాశాలు లేనప్పుడు మనకు డబ్బుకు డబ్బు వస్తుంది పేరు కూడా వస్తుంది చేయవచ్చు కదా అంటూ తనని బలవంతం చేశారట.ఇలా డబ్బు కోసం ఈ విధమైనటువంటి చెత్త వెబ్ సిరీస్ చెయ్యమని ఇలియానా పూజ హెగ్డే( Pooja Hedge ) కు సలహాలు ఇవ్వడంతో పూజ హెగ్డే చేయనని కరాకండిగా చెప్పేశారు.ఇక ఈ విషయం తెలిసి కొందరు పూజ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మరికొందరు చివరికి పూజ హెగ్డే పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది కామెంట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy