Mammootty: హీరో మమ్ముట్టి ఆ నటిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా..?

మలయాళ నటుడు మమ్ముట్టి ( Mammootty ) అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఈయన అప్పట్లో తన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Did Hero Mammootty Want To Marry The Actress For The Second Time-TeluguStop.com

అయితే వయసు మీద పడ్డాక కూడా తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణించారు.ఇక ప్రస్తుతం ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan ) సౌత్ లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు.

అయితే అలాంటి మమ్ముట్టి పెళ్లయి పిల్లలున్నాక కూడా ఓ స్టార్ హీరోయిన్ ప్రేమలో పడి ఆమెని రెండో పెళ్లి చేసుకోవాలని ఎంతగానో కలలు కన్నారట.ఇక ఆమె ఎవరో కాదు నటి ఊర్వశి.

ఒకప్పుడు ఊర్వశి ( Urvashi ) మలయాళ, తమిళ,తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.కానీ వచ్చిన స్టార్డం ని ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయింది.దాంతో పెళ్లయ్యాక కొన్ని కారణాల వల్ల మద్యపానానికి బానిసైంది.అయితే ఊర్వశి మమ్ముట్టి కలిసి దాదాపు 70 సినిమాల్లో నటించడం వల్ల వీరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందట.

కానీ ఊర్వశి ఆయన ప్రేమను పట్టించుకోకుండా మరో నటుడు మోహన్ లాల్ తో కూడా చనువుగా ఉండేదట.ఇక ఊర్వశి మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న మమ్ముట్టి తన భార్యకు విడాకులు ఇచ్చి ఊర్వశిని రెండో పెళ్లి చేసుకోవాలని కూడా ఎన్నో కలలు కన్నారట.

కానీ ఆయన ఆశలపై నీళ్లు చలినట్టు అయింది.ఎందుకంటే మోహన్ లాల్ ( Mohan lal ) తో ఊర్వశి చనువుగా ఉంటుంది అని ఇండస్ట్రీ మొత్తం టాక్ వినిపించడంత మమ్ముట్టి చాలా బాధపడ్డారట.అంతేకాదు ఆ తర్వాత ఊర్వశితో కలిసి నటించడం కూడా మానేశారట.ఇక ఈ విషయం తెలిసి ఊర్వశికి చాలామంది ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఇవ్వకపోయేసరికి మలయాళం నుండి తమిళ,తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube