తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలకు ఎంతో మంచి క్రేజ్ ఉంటుంది.వారిద్దరూ కలిసి కనుక సినిమాలలో నటిస్తే ఆ సినిమా మరో లెవెల్ లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.
ఇలాంటి జంటలలో కమెడియన్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం ( Bramhanandam ) నటి కోవై సరళ( Kovai Sarala ) జంట కూడా ఒకటి అని చెప్పాలి.వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఎన్నో సినిమాలలో వీరిద్దరూ భార్య భర్తలుగా నటించి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులందరికీ కడుపుబ్బా నవ్వించారు.
ఇప్పటికీ వీరిద్దరూ నటించడం సినిమాలు చూస్తే నవ్వు ఆపుకోలేరు అంతగా వీరి కాంబినేషన్ ఉంటుందని చెప్పాలి.
ఇక ఏ సినిమాలోనైనా బ్రహ్మానందం నటిస్తున్నారు అంటే ఆయన భార్యగా నటించే పాత్ర ముందు కోవై సరళ వద్దకే వెళుతుంది.కొన్ని అనివార్య కారణాలవల్ల ఆమె ఆ సినిమాలో నటించడానికి కుదరకపోతే వేరే వారిని తీసుకుంటారు తప్ప ముందు అవకాశం మాత్రం కోవై సరళ వద్దకు వెళుతుందని చెప్పాలి.ఇలా వీరిద్దరూ కలిసి ఎక్కువ సినిమాలలో నటిస్తున్నటువంటి తరుణంలో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు వచ్చాయి.
వీరి గురించి చెత్త రూమర్స్ ఇండస్ట్రీలో రావడంతో తన వల్ల బ్రహ్మానందం వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో కోవై సరళ తనతో కలిసి సినిమాలలో నటించకూడదని నిర్ణయించుకొని బ్రహ్మానందం సినిమాలను రిజెక్ట్ చేసేవారట.
ఈ విధంగా ఈమె బ్రహ్మానందంతో సినిమాలు చేయటానికి ఇష్టపడకపోవడంతో బ్రహ్మానందం నేరుగా కోవై సరళ ఇంటికి వెళ్లి అసలు నాతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అంటూ ఆమెను నిలదీశారట ఇలా తమ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి నా వల్ల నీ జీవితం ఇబ్బందులలో పడటం నాకు ఇష్టం లేదు అని కోవే సరళ చెప్పినప్పటికీ నువ్వు కనుక నా సినిమాలలో నటించకపోతే ఇకపై నీ మొహం కూడా చూడను అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారట.ఇక ఈ విషయం గురించి పునరాలోచన చేసినటువంటి కోవై సరళ నేను చేయని తప్పుకు నేను ఎందుకు భయపడాలి అంటూ తిరిగి బ్రహ్మానందం గారితో కలిసి సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు.ఇక కోవై సరళ తన జీవితంలో ఇప్పటికీ ఒంటరిగా గడుపుతూనే ఉన్నారు.
ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె అవకాశాలు వస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.