తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry ) ఎప్పుడో ఇండియా కి ప్రధాన ముఖచిత్రం గా మారిపోయింది.రాజమౌలి బాహుబలి సినిమాతోనే ఈ స్టార్ డం మన టాలీవుడ్ చిత్రాలకు తెచ్చి పెట్టాడు.
ఇదంతా పాత విషయమే.కానీ మొదటి నుంచి తెలుగు సినిమాలు తప్ప వేరే భాషల్లోకి సైతం తన సినిమాలు రావు అని చెప్తూనే ఉన్నాడు మహేష్ బాబు.
అందుకు తగ్గట్టు గానే కథలు కూడా సిద్ధం చేయిస్తాడు.ఇక మహేష్ బాబు( Mahesh Babu ) సైతం ఫ్యాన్ ఇండియా స్టార్ గా అవతరించాల్సిన సమయం రానే వచ్చింది.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమా( Guntur Karam ) కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.అయితే ఈ సినిమా తెలుగు లో మాత్రమే విడుదల అవుతుంది.
ఈ సినిమా పూర్తవగానే రాజమౌళి యూనిట్ లోకి జాయిన్ అయిపోతారు మహేష్ బాబు.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ మూవీ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ రాజమౌళి ఇప్పటికే స్టార్ట్ చేయగా, ఈ సారి అయినా మహేష్ బాబు ని పాన్ ఇండియా స్టార్( Pan India Star ) గా చూస్తారా అని ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.అయితే వస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి( Mahesh Babu Rajamouli )కి కొన్ని సూచనలు చేశారట.టాలీవుడ్ సినిమాగా మాత్రమే ఈ సినిమా ఉండాలని, ఏ భాషలో డబ్బింగ్ చేసుకున్న పర్వాలేదు కానీ, మెయిన్ ఫోకస్ మాత్రం తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయాలి అని చెప్పారట.
దీన్ని బట్టి చూస్తే మహేష్ కి ఫ్యాన్ ఇండియా కన్నా కూడా కేవలం లోకల్ బాయ్ నాని లా ఉండాలనే కుతూహలం ఎక్కువగా ఉందని తెలుస్తుంది.
ఇక ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మరియు సౌత్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించడం అనేది బాగా పెరిగింది.జూనియర్ ఎన్టీఆర్ మరియు హ్రితిక్ రోషన్ కలిసి వార్ 2 సినిమా( War2 Movie )లో నటిస్తున్నారు.అలాగే అట్లీ జవాన్ జోష్ లో తన మరొక సినిమా షారుక్ మరియు విజయ్ కాంబినేషన్ అని ఇప్పటికే ప్రకటించారు.
అలాగే మహేష్ బాబు కూడా ఒక బాలీవుడ్ హీరో తో కలిసి సినిమా తీస్తే బాగుంటుందని అయన అభిమానులు కోరుకుంటున్నారు.హైదరాబాద్ ఇప్పుడు సినిమా క్యాపిటల్ గా కనిపిస్తునం తరుణంలో ఇక్కడ నుంచే సినిమాలను మూవ్ చేస్తే ఒక పని అయిపోద్ది కానీ అని కూడా టాక్ నడుస్తుంది.