వినయ పాణిగ్రాహి, స్వాతి మండాది ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ధ్వని.నాగ దుర్గారావు సానా దర్శకత్వం వహిస్తున్నారు.
పరమకృష్ణ మరియు సాధన నన్నపనేని నిర్మాతలు.ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల కథానాయకుడు నవదీప్ విడుదల చేశారు.
తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను నటుడు గెటప్ శ్రీను విడుదల చేశారు.
ఈ సందర్భంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ ధ్వని మోషన్ పోస్టర్ బాగుంది.
కంటెంట్ బేస్డ్ సినిమాలను బాగా ఇష్టపడతారు.మంచి ప్రయత్నం తో చేసిన ధ్వని సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.శబ్ధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం.
సస్పెన్స్ థ్రిల్లర్‍గా రూపొందింది.ఇందులో కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉంటుందని సినీ దర్శకుడు నాగ దుర్గారావు సానా తెలిపారు.
నటీనటులు: త్రినాథ్ వర్మ, రవీందర్ రెడ్డి, భానవ సాగి తదితరులు
.






