ఐపీఎల్ ( IPL )చరిత్రలో ఏ జట్టుకు లేని ఒక గొప్ప రికార్డును చెన్నై సూపర్ కింగ్స్( CSK )సృష్టించింది ఇంతవరకు జరిగిన 14 ఐపీఎల్ లో పది సార్లు ఫైనల్ కు వెళ్లి నాలుగు సార్లు విజేతగా నిలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది ….ఐపీఎల్ లో మరే ఇతర జట్టుకు ఈ స్థాయి విజయాలు లేవు .
ఇదంతా కేవలం ధోని సారధ్య మహిమే( MS Dhoni ) అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.జాతీయ జట్టు నుంచి రిటైర్ అయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తన నాయకత్వం సామర్థ్యంలో ఏ లోటు లేదని నిరూపించుకుంటున్న ధోని తనకు దొరికిన సాధారణ ఆటగాళ్లతోనే అసాధారణ జట్టు ను తయారు చేస్తున్నాడు.
ఇతర జట్ల లో అనామకంగా మిగిలిపోతున్న ఆటగాళ్ళు ధోనీ చేతుల్లో మాత్రం మెరికల్లా మెరిసిపోతూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకుంటున్నారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లకు 172 పరుగులు చేసింది.టార్గెట్ తక్కువే అయినప్పటికీ గుజరాత్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోతూ 20 ఓవర్లకు 150 పరుగులు చేసే అలౌట్ అయ్యింది .మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Hardik pandya ), ధోనీ అద్భుతమైన సారధ్యం కారణంగానే తమ జట్టు వోటమి పాలైందని తెలిపాడు .ధోని సమయానుకూల బౌలింగ్ మార్పులతో తమ బ్యాట్స్మెన్ ల పై ఒత్తిడి పెంచాడని, ధోని కెప్టెన్సీ లో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ఒక పది పరుగులు టార్గెట్ పెరిగినట్లే అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

లీగ్ లో దశ మ్యాచ్లో మూడు సార్లు గుజరాత్ చేతిలో ఓడిపోయినప్పటికీ కీలకమైన మ్యాచ్లో తనదైన శైలిలో చక్రం తిప్పిన ధోని చెన్నై జట్టు ఫైనల్ కు చేరటంలో ప్రధాన పాత్ర వహించాడు .ముఖ్యంగా ఫీల్డింగ్ మార్పులతో గుజరాత్ బ్యాట్స్మెన్లు బుట్టలో వేసిన ధోని పాండ్య ను అవుట్ చేయడానికి చేసిన ఫీల్డ్ సెట్టింగ్.అతని సమర్థతను రుజువు చేస్తుంది….40 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా యువ ఆటగాళ్లతో పోటీపడుతున్న ధోని తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉంది అన్న సందేశాన్ని ఇస్తున్నాడు.







