తన రూటే సేపరేటు అంటున్న సిద్ధరామయ్య!

ఉత్కంట పరిస్థితులలో కర్ణాటక ముఖ్యమంత్రిగా( Siddaramaiah ) ఎన్నికైన తర్వాత తన నిర్ణయాలతో కన్నడ ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి ఆయనను అభినందించడానికి అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పోటీపడుతున్నారు ,గజమాల లతో, బొకేలతో ఆయనను అభినందించి ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు.అయితే వీటన్నిటిని సున్నితం గా తిరస్కరిస్తున్న ఆయన తనను కలవడానికి ఎవరు పోటీ పడవద్దు అని ప్రకటించారు బొకేలు, గజమాలలతో డబ్బులును వృధా చేసుకోవద్దని, దానికి బదులుగా తనకు పుస్తకాలు గిఫ్ట్ గా ఇవ్వండి అని అవి సమాజానికి ఉపయోగపడతాయని చెప్పడం ఆసక్తి మారింది .

 Siddaramaiah Good Decesion Over Banglore Traffic , Siddaramaiah , Zero Traffic ,-TeluguStop.com
Telugu Banglore, Congress, Karanataka Cm, Karnataka, Siddaramaiah, Zero-Telugu P

అంతేకాకుండా బెంగళూరు ( Bangalore )ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్..సీఎం వెళ్లే దారిలో గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయిన సంఘటనలు మనం తరచూ వింటూ ఉంటాం.సామాన్య ప్రజలు కూడా ఈ వ్యవహారాల పట్ల విసిగిపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా భరిస్తారు.

అయితే ఇప్పుడు ఆ జీరో ట్రాఫిక్ విధానాన్ని తనకోసం అమలు చేయవద్దని ఆయన ఎస్పీకి లేఖ రాయడం సంచలనం కలిగిస్తుంది.ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బెంగళూరును తన పర్యటనల కోసం మరింత ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదని తనకు జీరో ట్రాఫిక్ సౌకర్యం( Zero traffic ) అవసరం లేదని ఆయన ఎస్పీకి లేఖ రాశారు .

Telugu Banglore, Congress, Karanataka Cm, Karnataka, Siddaramaiah, Zero-Telugu P

ఈ నిర్ణయంతో కన్నడ సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తున్న ఉద్యోగులు మరియు సామాన్య జనం కూడా చాలా ఆనంద పడుతున్నారు.ముఖ్యమంత్రి నిర్ణయం తమకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తుందని తమకు సమయం అవుతుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు .ఏది ఏమైనా తాను మాటల ముఖ్యమంత్రిని కాదని చేతల ముఖ్యమంత్రిని ఆయన మరోసారి నిరూపించుకున్నట్లుగా అయింది.అంతేకాకుండా తానంత సింపుల్గా ఉంటానో తన విధానాలు ఎంత సులభతరంగా ఉంటాయో ఆయన ఈ చర్య ద్వారా నిరూపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube