అంబటి రాయుడుకు జీవితాంతం గుర్తిండి పోయే మెమోరీ ఇచ్చిన ధోని..!

ఐపీఎల్ సీజన్-16( IPL Season-16 )టైటిల్ చెన్నై ( CSK Team )జట్టు గెలిచింది.అయితే అంబటి రాయుడు( Ambati Rayudu ) ఈ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ తరువాత రిటైర్డ్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Dhoni Gave Ambati Rayudu A Memory That Will Be Remembered For The Rest Of His Li-TeluguStop.com

ఇక రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడుకు చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని( MS Dhoni ) జీవితాంతం గుర్తిండి పోయే మెమోరీ అందించాడు.

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా నుంచి మహేంద్రసింగ్ ధోని ట్రోఫీ అందుకోకుండా.

అంబటి రాయుడు, రవీంద్ర జడేజా( Ravindra jadeja ) పిలిచి వారికి కప్ స్వీకరించమని తెలిపాడు.ధోని చేసిన పనికి స్టేడియంలో ఉండే అభిమానులు దట్ ఇజ్ ధోని అంటూ సందడి చేశారు.

రిటైర్మెంట్ అవుతున్న రాయుడికి, ఫినిషింగ్ టచ్ ఇచ్చి గెలిపించిన జడేజాకు కప్ స్వీకరించమని పక్కకు జరిగి, రోజర్ బిన్నీ, జై షా లను వీరికి ట్రోఫీ అందించమని మహేంద్ర సింగ్ ధోని కోరాడు.ఇక ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో రాయుడు ఆనంద భాష్పాలు రాల్చాడు.

ఫైనల్ మ్యాచ్ విజయంలో అంబటి రాయుడు కూడా కీలక పాత్ర పోషించాడు.చెన్నై జట్టు 12 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.తర్వాత మోహిత్ శర్మ బౌల్ చేసిన 13వ ఓవర్లో అంబటి రాయుడు 6, 4, 6 లతో చెలరేగాడు.8 బంతులలో ఒక బౌండరీ, రెండు భారీ సిక్సర్లతో 19 పరుగులు చేశాడు.

ఇక ఆఖరి ఓవర్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది.చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేస్తే చెన్నై గెలుస్తుంది.ఇక క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా 6,4 లతో చెలరేగి ఫినిషింగ్ టచ్ ఇచ్చి నేరుగా ధోని వద్దకు పరుగులు తీశాడు.జడేజాన్ కౌగిలించుకొని ధోని కన్నీరు పెట్టుకున్నాడు.

అప్పుడు చెన్నై జట్టు సభ్యులంతా ధోని చుట్టూ చేరారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube