దేశరాజధాని ఢిల్లీలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఎదుట టీఆర్ఎస్ మహిళా నేత ధర్నాకు దిగారు.శనివారం ఉస్మానియా వర్సిటీ టీఆర్ఎస్ మహిళా ప్రెసిడెంట్ దాత్రిక స్వప్న ఆందోళన చేపట్టారు.
సీఎం కేసీఆర్ ను కలుద్దామంటే కూడా పోలీసులు కలవనివ్వడం లేదని తెలిపారు.కేసీఆర్ ను హైదరాబాద్‌లో కలుద్దామంటే ప్రగతి భవన్ ముందుకు కూడా రానివ్వడం లేదన్నారు.
గత మూడు రోజులుగా కేసీఆర్‌ను కలిసేందుకు పడిగాపులు కాస్తున్నట్లు చెప్పారు.ఉద్యమకారులకు ఏదో ఒక అవకాశం కల్పించాలని కోరారు.
ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశామని చెప్పారు.ఉద్యమకారులకు అవకాశాలు కల్పించాలని దాత్రిక స్వప్న డిమాండ్ చేశారు.