మన టాలీవుడ్ డైరెక్టర్లలో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) ఒకరు.ఈయన ముందు నుండి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను సెట్ చేస్తున్నారు.కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ( Dhanush ) తో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు రోజులు అవుతుంది.అయితే ఇంత వరకు ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళలేదు.మరి తాజాగా ఈ సినిమా షూట్ గురించి ఒక అప్డేట్ తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మొదలు పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి…
వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ చేయబోతున్నారట.ముంబై తదితర ప్రాంతాల్లో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతానికి ”D51” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ధనుష్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
ఇటీవలే నాగార్జున( Nagarjuna ) కూడా ఈ సినిమాలో భాగం అయినట్టు తెలపడంతో ఇది మల్టీ స్టారర్ అని తేలిపోయింది.కాగా ఈ సినిమాను శేఖర్ కమ్ముల ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ప్లాన్ చేసినట్టు పీరియాడిక బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ డ్రామాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు LLP బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.