మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నక్కిన త్రినాథ్ రావు డైరక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ధమాకా.క్రిస్ మస్ రేసులో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ న్యూస్ మాస్ రాజా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది.
సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది అనుకుంటున్న టైం లో రషెస్ చూసిన రవితేజ రీ షూట్స్ చేయాలని చెప్ప్పారట.బాగా వస్తాయని అనుకున్న సీన్స్ అనుకున్నంత రేంజ్ లో రాకపోయే సరికి రవితేజ వాటిని రీ షూట్స్ చేయాలని అనుకున్నారట.
అంతేకాదు కొన్ని సీన్స్ లో డైలాగ్స్ ని కొత్త రైటర్ తో రాయించారని తెలుస్తుంది.
కన్నడ భామ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మాస్ రాజా ఫ్యాన్స్ ని అలరించేలా తెరకెక్కిస్తున్నారట.
అయితే సినిమా మొత్తం బాగున్నా కొన్ని సన్నివేశాలు మాస్ మహరాజ్ కి నచ్చకపోవడంతో వాటిని రీ షూట్స్ చేస్తున్నారని తెలుస్తుంది.పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ మూవీని రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారని టాక్.
క్రాక్ తర్వాత మళ్లీ వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్న రవితేజ ధమాకాతో దుమ్ముదులిపేయాలని చూస్తున్నాడు.మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.







