ఈ ఆలయంలో పీతలను నైవేద్యంగా సమర్పిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయట..!

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్వామివారికి నైవేద్యంగా ఏ పండు, ఫలము, ఏదైనా తీపి వంటకాన్ని సమర్పిస్తాము.కానీ దేవుడికి నైవేద్యంగా పీతలను సమర్పించడం విన్నారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

గుజరాత్, సూరత్ లో ఉన్న శివాలయంలో భక్తులు స్వామివారికి బ్రతికున్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ విధంగా స్వామివారికి పీతలను ఎందుకు సమర్పిస్తారో? ఈ ఆలయ చరిత్ర ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల ప్రకారం శివుడికి పరమ భక్తుడైన భక్త కన్నప్ప ప్రతిరోజు స్వామి వారికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించే వాడు.

స్వామిపై ఉన్న భక్తితో భక్తకన్నప్ప ఒకరోజు స్వామి వారికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించిన విషయం మనకు తెలిసిందే.భక్తితో సమర్పించిన ఎలాంటి నైవేద్యం అయినా స్వామి వారు స్వీకరిస్తారని భక్తకన్నప్ప రుజువు చేశాడు.

అదే విధంగానే ప్రస్తుతం గుజరాత్ సముద్రతీరంలో పిక్నిక్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందిన గల్టేశ్వర్, శివుడికి అంకితం చేయబడిన ఆలయం.భక్తుల కోరికలను తీర్చడంలో ఆ పరమశివుడు ముందుంటాడు.

Advertisement

భక్తి శ్రద్దలతో స్వామివారిని పూజిస్తే వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు కూడా విశ్వసిస్తుంటారు.

సూరత్ లో ఉన్న శివ భక్తులు కూడా స్వామి వారిని ఈ విధంగానే విశ్వసిస్తారు.ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది.ఇక్కడభక్తులు స్వామివారికి బతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పించడం వల్ల వారికి చెవిలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

అందుకోసమే ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారికి పీతలను సమర్పిస్తుంటారు.అలా చేయటంవల్ల వారికి చెవిలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

అయితే ఈ ఆలయానికి ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి పీతలను నైవేద్యంగా సమర్పించడం విశేషం.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు