సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటీనటులు తమ కెరీర్ మొదట్లో కొన్ని కష్టాలు ఎదుర్కొంటుంటారు.అంతేకాకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమ గమ్యాన్ని చేరుకుంటారు.
మరికొందరు ఎటువంటి కష్టాలు లేకుండా సులువుగా ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటారు.కానీ కష్టపడి పైకి వచ్చిన వాళ్లకి కష్టం యొక్క విలువ తెలుస్తుంటుంది.
ఇది సెలబ్రిటీల విషయంలోనే కాకుండా సామాన్యుల విషయంలో కూడా జరుగుతూనే ఉంటుంది.ఇక ఓ నటి కూడా తాను పడిన కష్టాల గురించి కొన్ని విషయాలు పంచుకుంది.
ఇంతకీ ఆ నటి ఎవరో కాదు దేవిక వత్స.ఈమె తన సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.నటిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు చేపట్టింది.ముంబైలో పుట్టి పెరిగిన దేవిక తన చదువు పూర్తి చేసుకుని మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.
ఆ తర్వాత పలు ప్రకటనలలో కూడా నటించి మంచి గుర్తింపు అందుకుంది.ఇక యూట్యూబ్ లో పలు వీడియోలను, షార్ట్ ఫిలిమ్స్ లను కూడా చేసింది.
అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా అడుగు పెట్టి పలు సీరిస్ లలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

2017 లో గబ్రూ: హిప్ హాప్ కే షెహజాదే అనే సిరీస్ తో తొలిసారిగా పరిచయమైంది.ఇక ఈ సిరీస్ లో మంచి సక్సెస్ అందుకొని పలు సిరీస్ లలో అవకాశాలు అందుకుంది.ఇక వెండితెరపై కూడా తాను ఏమిటో నిరూపించుకోవాలని అనుకోగా.
తనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది.

ఇక పలు సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టగా.తాను దీని గురించి కొన్ని విషయాలు పంచుకుంది.నటుల కంటే టెక్నీషియన్ల కష్టం ఎక్కువ అంటూ అందుకు వారందరికీ గౌరవం ఇవ్వాలని తెలిపింది.
ఈ విషయాన్ని తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినందుకు చెప్పడం లేదు అంటూ.తాను కొన్ని ప్రకటనలు షూట్స్ చేసిన సమయంలో తము పడిన కష్టం తనకు తెలుసని అందుకే కొన్ని రోజులు ఆ బాధ్యతలు చేపట్టానని తెలిపింది.