విశాఖ నగర అభివృద్ధి లో భాగంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనే ప్రధాన కర్తవ్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు.మంగళవారం ఆమె మూడవ జూన్ 23 వ వార్డు పరిధిలోని మద్దిలపాలెం, చైతన్య నగర్, కె ఆర్ ఎం కాలనీ లలో సిసి రోడ్లు, సి సి కాలువలు, నీటిపారుదల కాలువల నిర్మాణానికి సుమారు రూ.80.98 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ గుడ్ల విజయసాయి తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో విశాఖ నగరాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఆయన ఆధ్వర్యంలో ప్రతి వార్డులో మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
నేడు మన 23వ వార్డులో వార్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సుమారు 81 లక్షల రూపాయలతో తొమ్మిది చోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ప్రతి పని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శివప్రసాద్, కార్యనిర్వాహన ఇంజనీర్ శ్రీనివాస్, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు సత్య రెడ్డి, సచివాలయం సెక్రటరీలు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.