యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.( Devara ) ఈ సినిమాపై అప్పుడే హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది.
ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అండ్ టీమ్ చాలా కష్టపడుతున్నారు.కొరటాల ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో హాలీవుడ్ రేంజ్ లో భారీ హంగులతో తెరకెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా క్రేజీ సీక్వెన్స్ షూట్ లో బిజీ బిజీగా ఉంది.ఈ క్రేజీ సీక్వెన్స్ ను అండర్ వాటర్ లో ప్లాన్ చేసారు.దీంతో వాటర్ లో షూట్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.ఈ సీక్వెన్స్ షూటింగ్ భారీ సెట్స్ మధ్య జరుగుతుంది.
బ్లూ మ్యాట్స్ మధ్య వాటర్ పూల్ లో( Waterpool ) ఈ క్రేజీ సీక్వెన్స్ ను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సీక్వెన్స్ షూట్ లో భాగంగా ఒక పిక్ బయటకు రావడంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యింది.మరి ఈ క్రేజీ వాటర్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్ట్ చేయడంలో ఆలస్యం అయినప్పటికీ షూటింగ్ కు పెద్దగా గ్యాప్ లేకుండా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ అవ్వగా ఈ ఫస్ట్ లుక్ లతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటిస్తుండగా.విలన్ గా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.