క్రేజీ సీక్వెన్స్ లో కష్టపడుతున్న ‘దేవర’ టీమ్.. పిక్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''దేవర''.

( Devara ) ఈ సినిమాపై అప్పుడే హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది.

ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అండ్ టీమ్ చాలా కష్టపడుతున్నారు.కొరటాల ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో హాలీవుడ్ రేంజ్ లో భారీ హంగులతో తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా క్రేజీ సీక్వెన్స్ షూట్ లో బిజీ బిజీగా ఉంది.

ఈ క్రేజీ సీక్వెన్స్ ను అండర్ వాటర్ లో ప్లాన్ చేసారు.దీంతో వాటర్ లో షూట్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

ఈ సీక్వెన్స్ షూటింగ్ భారీ సెట్స్ మధ్య జరుగుతుంది.బ్లూ మ్యాట్స్ మధ్య వాటర్ పూల్ లో( Waterpool ) ఈ క్రేజీ సీక్వెన్స్ ను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.

"""/" / ఈ సీక్వెన్స్ షూట్ లో భాగంగా ఒక పిక్ బయటకు రావడంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యింది.

మరి ఈ క్రేజీ వాటర్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్ట్ చేయడంలో ఆలస్యం అయినప్పటికీ షూటింగ్ కు పెద్దగా గ్యాప్ లేకుండా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.

"""/" / ఇప్పటికే ఈ సినిమా నుండి మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ అవ్వగా ఈ ఫస్ట్ లుక్ లతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.

కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటిస్తుండగా.

విలన్ గా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.

అప్పుడు మీరు .. ఇప్పుడు వారు  ! రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదే బాసూ