రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ , బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్ ముగిసింది.ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై జనసేనాని వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది.
ఏపీలో నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన కొనసాగుతుందన్న పవన్ కల్యాణ్ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.చంద్రబాబు, తనవి భిన్నమైన ఆలోచనలు అయినప్పటికీ చంద్రబాబును అన్యాయంగా రిమాండ్ కు పంపారన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు జైలుకు వచ్చానని పేర్కొన్నారు.జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ సమగ్రతే తన లక్ష్యమని చెప్పారు.
దేశానికి బలమైన నాయకుడు కావాలనే గతంలో మోదీకి మద్ధతు ఇచ్చినట్లు తెలిపారు.తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్లనన్న పవన్ విడిపోయిన రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలనుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే చంద్రబాబుతో విబేధాలు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చన్నారు.పాలసీ పరంగా విబేధించవచ్చు.
కానీ పాలనా పరంగా చంద్రబాబు అనుభవం ఉన్న నేతని తెలిపారు.