తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా జనసేనతో( Janasena ) పొత్తు పెట్టుకోవడం జరిగింది.2014 మాదిరిగా 2024 ఎన్నికలను గెలవాలని చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు.ఏపీలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.
దీంతో ప్రచారం విషయంలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పార్టీతో పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇంకా ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి.
ఇటీవల “నవశకం” కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యింది.దాదాపు పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు వేదికను పంచుకోవడం జరిగింది.
ఇక ఇదే సమయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉండగా ఈనెల 28, 29, 30 తారీఖులలో మూడు రోజులపాటు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించడానికి సిద్ధం కావడం జరిగింది.ఈ పర్యటనలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశం కానున్నారు.రానున్న ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు.ఇదిలావుండగా నేడు ఉండవల్లిలో చంద్రబాబు చండీయాగం నిర్వహించడం జరిగింది.ఈ యాగం ముగిసిన వెంటనే హైదరాబాద్ కి బయలుదేరారు.
ఈనెల 25, 26, 27 హైదరాబాద్ లోనే ఉండనున్నారు.అనంతరం ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.