అమెరికా అధ్యక్షుడిగా జో బైడేన్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మోడీ అమెరికా పర్యటన చేపడుతున్నారు.దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.
ఆరు నెలల తర్వాత మోడీ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇది.ఈ క్రమంలో 24 వ తారీకు వాషింగ్టన్లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడేన్ తో పాటు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని తో క్వాడ్ సదస్సులో పాల్గొంటారు.
తర్వాత రోజు న్యూయార్క్ వేదికగా అనగా 25వ తారీకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ చర్చావేదికలో డిబేట్లో ప్రధాని మోడీ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు.ఈ సందర్భంగా ఉగ్రవాదంపై అదే రీతిలో కరుణ వంటి విషయాలపై మోడీ అంతర్జాతీయ సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం.
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా దిగిన తర్వాత జో బైడేన్ ఎన్నికైన తర్వాత అమెరికా కి మోడీ వెళ్తుండటంతో అంతర్జాతీయ స్థాయిలో అమెరికా మోడీ పర్యటన ఆసక్తికరంగా మారింది.