మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ది సపరేట్ రూట్ .అల్లు అర్జున్ సినీ కెరీర్లో తనదైన స్టైల్ లో నటిస్తూ ,స్టోరీస్ సెలెక్షన్ లో కొత్తదనం చూపిస్తూ ,టాలీవుడ్ లో ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
తాను చేస్తున్న సినిమాల్లో కొత్తదనం , చేస్తున్న క్యారెక్టర్స్ లో కొత్తదనం ఫైట్స్ లో ఈజ్ ,డాన్స్ లో ఆ క్రేజ్ ,ఇలా ఒక్కొక్కొ టి కేర్ తీసుకొని ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసి వెన్న లాంటి మనసు ఉన్న గొప్ప నటుడు బన్నీ .గంగోత్రి సినిమా తో తన సినీ కెరీర్ మొదలు పెట్టి , పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరో గా ఎదిగారు అంటే అది బన్నీ చేసిన హార్డ్ వర్క్ ,తన కృషి అని చెప్పవచ్చు.
ఇక ఇటీవలే వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది మూవీ యూనిట్ .ఇక ఈ మూవీ సక్సెస్ పై మీడియోకు ప్రత్యేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది మూవీ యూనిట్.ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవిఅల్లు అర్జున్ స్టార్ గా ఎదుగడం చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది అని తెలియజేసారు .ఇక కెరీర్ పరంగా అల్లు అర్జున్ ఎదుగుతున్న విధానాన్ని చూస్తుంటే చాలా ఎంతో మచ్చటేస్తోందని అన్నారు.కెరీర్ ఆరంభం నుంచి ఎంతో కష్టపడుతున్న బన్నీ.
ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప క్రేజ్ అందుకోవడం అంటే అంతా ఈజీ కాదు ,ఈ కష్టం వెనుక చాలా శ్రమ దాగి ఉన్నది ,ఇది ఒక్కరోజు ఓవర్ నైట్ సక్సెస్ కాదు.
ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది .అభిమానుల కోసం తమ స్టార్ హీరో స్ నటించిన సినిమాలు మల్లి రీ -రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.పవన్ నటించిన ఖుషి , బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి ,ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీస్ రీ -రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా అలరించాయి.
అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ అల వైకుంఠపురములో, ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ ,అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్ , త్రివిక్రమ్ డైరెక్షన్ ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా బన్నీ ని 100 కోట్ల క్లబ్ లోకి చేర్చింది.ఇక అల వైకుంఠపురములో, సినిమా తరువాత అల్లు అర్జున్ -డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా పుష్ప మూవీ లో నటించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.ఇక అసలు విషయానికి వస్తే .స్టార్ హీరోస్ పుట్టిన సందర్భంగా తన కెరీర్ లో సూపర్ హిట్ , బెస్ట్ పెర్ఫామెన్స్ ,ఇండస్ట్రీ హిట్ అందుకున్న మూవీస్ మల్లి రీ -రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే .ఇక స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున ఏప్రిల్ 8 న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ -డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మూవీ దేశముదురు సినిమాను బన్నీ అభిమానుల కోసం మల్లి 4k వెర్షన్ లో రీ -రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ .