సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఎక్కువ కాలం పాటు నిలదొక్కుకోవాలంటే నటనా నైపుణ్యంతో పాటు అందం కూడా ఎంతో ముఖ్యం.ఇలా అందంగా కనిపించడం కోసం హీరోయిన్లు ఎంతో కష్ట పడుతూ ఉంటారు.
ఇలా అందంగా, స్లిమ్ గా కనిపించడం కోసం ఎంతోమంది హీరోయిన్లు గంటల తరబడి జిమ్ ల్లో కష్టపడుతూ ఉంటారు.అలాంటి వారిలో మన అల్లు అర్జున్ దేశముదురు హీరోయిన్ హన్సిక ఒకరు.
అతి చిన్న వయసులోనే దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఇలా మొదటి సినిమానే ఇంత విజయవంతం కావడంతో ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
ఇకపోతే ఈమె తెలుగులో మస్కా, ఓ మై ఫ్రెండ్, కంత్రి, కందిరీగ, దేనికైనా రెడీ వంటి చిత్రాలలో నటించిన దేశముదురు సినిమా హిట్ ఇచ్చినట్టుగా మరే సినిమా ఇవ్వలేదనే చెప్పాలి.ఇక తెలుగులో ఈమె సినిమాలలో నటించిన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకోకపోవడం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హన్సిక అక్కడ మాత్రం ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య దేవతగా మారిపోయింది.ఎంతగా అంటే చివరికి ఈమెకు గుడి కట్టి అభిమానించే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అయితే హన్సిక ఎంతో ముద్దుగా బొద్దుగా అధిక శరీర బరువుతో ఉన్నప్పుడు కూడా ఈమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఈ క్రమంలోనే హన్సికను తమిళ ప్రేక్షకులు జూనియర్ కుష్బూ అంటూ ఆమెను ఎంతో ప్రేమగా పిలుచుకునే వారు.
ఇక తమిళంలో కూడా కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా తన అవుట్ లుక్ మార్చేయాలని భావించిన హన్సిక నిత్యం ఎంతో వర్కౌట్స్ చేస్తూ పూర్తిగా తన శరీరంపై దృష్టి పెట్టింది.ఈ క్రమంలోనే భారీగా కష్టపడిన హన్సిక ప్రస్తుతం ఎంతో స్లిమ్ గా, నాజూగ్గా మారిపోయింది.
ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన తాజా ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఒక్కసారిగా హన్సికని ఇలా చూసే సరికి అక్కడ హన్సికానేనా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె షేర్ చేసిన ఫోటోలు పెద్దఎత్తున వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందించి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.కొందరు మాత్రం ఈ లుక్ లోసూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఏంటి హన్సిక ఇలా పేలగా మారిపోయావు.తిండి తినడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయా? అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.అవకాశాల కోసం పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడైనా అవకాశాలు వస్తాయా… లేదంటే అవకాశాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా అనే విషయం తెలియాల్సి ఉంది.