భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ మైదానంలోనూ, బయటా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు.ఇటీవల కాలంలో బెస్ట్ ఫినిషర్‌గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
ఈ క్రమంలో కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో తిరిగి టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.తరచూ సోషల్ మీడియాలో అభిమానులను సంతోష పెట్టడానికి ఆసక్తికరమైన పోస్ట్‌లను పంచుకుంటాడు.
ఇక సౌతాఫ్రికాతో టీమిండియా 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది.విశాఖలో మూడో మ్యాచ్‌లో విజయం తర్వాత రాజ్‌కోట్‌లో నాలుగో మ్యాచ్ ఆడేందుకు జట్టు పయనమైంది.
ఈ తరుణంలో విమానంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వైరల్ అయిన వీడియోలో విమానంలో పొగమంచు లాంటి ఆవిరి కనిపిస్తోంది.అందులో నుంచి సినిమా హీరో మాదిరిగా దినేష్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చాడు.గురువారం పోస్ట్ చేసిన వీడియోకి ఇప్పటికే ట్విటర్‌లో 3.40 లక్షలకు పైగా వ్యూస్ దక్కాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.క్రికెట్ అభిమానులు దినేష్ కార్తీక్ వీడియోకు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఇక నాలుగో వన్డేలో దినేష్ కార్తీక్ 55 పరుగులతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.చివర్లో వచ్చినా, జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు.ఈ మ్యాచ్‌లో విజయంతో సిరీస్ 2-2తో సమం అయింది.ఇక జూన్ 19న ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ ఫలితం సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది.