అమెరికన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న తాజా అధ్యయనం...!!

కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం కదా మనకేం దిగులు, ప్రభుత్వమే మాస్క్ లు తీసేసుకోండని చెప్పాక మాస్కులతో పనేంటి అనుకున్నారు అమెరికన్స్ కానీ కరోన థర్డ్ వేవ్ అమెరికాలో తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుందనే విషయాన్ని ఊహించలేక పోయారు అంతేకాదు కరోనా తగ్గుముఖం పట్టినా సామాజిక దూరం , మాస్క్ తప్పని సరిగా వాడటం మంచిదనే అంశాన్ని మరిచిపోయారు.

ఇంకేం నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే థర్డ్ వేవ్ ముంచుకొచ్చింది.

అలా ఇలా కాదు అమెరికాలో వారాల వ్యవధిలో డెల్టా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది.గడిచిన రెండు వారాలలో కరోనా కేసుల సంఖ్య ఏ స్థాయికి పెరిగిందో తెలుస్తే షాక్ అవుతారు.

దాదాపు 166 శాతం థర్డ్ వేవ్ కేసుల సంఖ్య పెరిగిందట.ఈ వార్తతోనే అమెరికన్స్ కు నిద్ర పట్టక చస్తుంటే మరొక పిడుగు లాంటి వార్త వినే సరికి కరోనా మొదటి వేవ్ అమెరికన్స్ కళ్ళ ముందు ఒక్క సారిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యిందట.దాంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని అమెరికన్స్ గొల్లుమంటున్నారు.

ఇంతకీ తాజాగా జరిగిన ఆ అధ్యయనం ఏంటి అందులో ఎలాంటి భయానక విషయాలు వెల్లడించారు నిపుణులు అనే విషయాన్ని పరిశీలిస్తే.

Advertisement

అమెరికా ప్రజలు వ్యాక్సినేషన్ విషయంలో తీవ్ర అశ్రద్ద చూపుతున్నారని, ఇలానే పరిస్థితి కొనసాగితే మాత్రం అక్టోబర్ నెలలో డెల్టా కరోన మొదటి వేవ్ కంటే కూడా తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు.అదే గనుకా జరిగితే అమెరికాలో ప్రతీ రోజు 2.40 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అలాగే రోజుకు ఎంత హీనంగా చూసుకున్నా 4వేల మంది చనిపోయే అవకాశం ఉందని గుండెలు అదిరిపోయే వార్త చెప్పారు.అమెరికాలో కొత్తగా నమోదయ్యే కేసులలో దాదాపు 85శాతం డెల్టా వేరియంట్ లు ఉన్నాయని ప్రజలు ఇప్పటికైనా వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు