ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Kejriwal ) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ ను ఆయన అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.కేజ్రీవాల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్టు( Kejriwal arrested )పై ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది.దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లారు.కాగా కేజ్రీవాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.