ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు.ఈ మేరకు దర్యాప్తు సంస్థల తీరుపై సీఎం కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కోర్టుకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం ఇస్తున్నాయని సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు.కొందరి పేర్లను చెప్పాలని చందన్ రెడ్డిని ఈడీ టార్చర్ చేసిందన్నారు.
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్లను కూడా దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని ఆరోపించారు.రూ.100 కోట్లు అంటారు కానీ ఒక్క పైసా దొరకలేదన్నారు.మోదీకి వెయ్యి కోట్లు ఇచ్చానని చెప్తే నమ్ముతారా? విచారణ చేస్తారా అని ప్రశ్నించారు.కొత్త లిక్కర్ పాలసీతో 50 శాతం ఆదాయం పెరిగిందని చెప్పారు.లిక్కర్ స్కాం అనేదే లేదన్న కేజ్రీవాల్ కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.







