ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు( Tihar jail: )కు వెళ్లనున్నారు.ఈ మేరకు కేజ్రీవాల్ కు ఈనెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.
కేజ్రీవాల్ ఈడీ కస్టడీ( ED ) ముగిసిన నేపథ్యంలో ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ అభ్యర్థన మేరకు కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
అయితే జైలులో ప్రత్యేక ఆహారం, మందులు,పుస్తకాలు, మతపరమైన లాకెట్ కలిగి ఉండటానికి కేజ్రీవాల్ తరపు లాయర్లు న్యాయస్థానాన్ని అనుమతి కోరారు.భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను చదవడానికి కేజ్రీవాల్ ను అనుమతి కోరారు.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్( Delhi Liquor Policy Money Laundering ) కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.