Malware Apps: మీ ఫోన్‌లో వీటిని ఇన్‌స్టాల్ చేసారా? వెంటనే డిలీట్ చేయండి, లేదంటే?

టెక్నాలజీ రోజురోజుకీ పెరిగిపోతుందని సంతోషం పడాలో, బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది.నేడు ప్రతిఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ కొలువుదీరాయి.

 Delete These Malware Apps Immediately From Your Mobile Details,  Application, Te-TeluguStop.com

దాంతోపాటు సైబర్ దాడులు కూడా ఎక్కువగా పెరిగిపోయాయి.జనాలను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు అనేకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు.

ఈమధ్య కాలంలో చూసుకుంటే కొన్ని రకాల యాప్స్ ద్వారా యూజర్లను టార్గెట్ చేస్తున్నారు.అందుకే సదరు సో కాల్డ్ యాప్స్ మీ దగ్గర వున్నపుడు కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం.

ఓ రకంగా అలాంటివి ఉంటే వెంటనే డిలీట్ చేయడమే ఉత్తమం.

లేనియెడల మీ విలువైన డేటా హ్యాకర్ల చేతుల్లో క్షణాల్లో వెళ్లిపోయే ప్రమాదం కలదు.

తాజాగా ఈ విషయమై యూజర్ల డేటాను తస్కరించే డేంజరస్ మాల్వేర్‌తో కూడిన యాప్స్ అనేకం గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నాయని ఓ భద్రతా సంస్థ కనుగొంది.డాక్టర్ వెబ్ యాంటీవైరస్ టూల్స్ ద్వారా గుర్తించిన ఈ డేంజరస్ యాప్‌లు 2 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు కలిగి ఉన్నాయని చెప్పడం గమనార్హం.

ఆండ్రాయిడ్ యూజర్లు తమ ప్రైవేట్ డేటాను సేఫ్‌గా ఉంచుకోవాలంటే వాటిని వెంటనే డివైజ్ నుంచి తొలగించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాటిలో ప్రధమంగా TubeBox అనే యాప్‌ ఒకటి.

Telugu Delete, Fast Master, Install, Latest, Malware Apps, Ups, Tubebox-Latest N

ఈ యాప్ ఒక మిలియన్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.అలాగే గూగుల్ ప్లే స్టోర్‌లో Fast Cleaner Cooling Master అనే మరో డేంజరస్ యాప్ కలదు.ఈ యాప్ ఇన్ స్టాల్ అయిన డివైజ్‌లో యాడ్స్ డిస్‌ప్లే చేస్తుంది.ఈ యాప్‌ ఇప్పటివరకూ 5లక్షల డౌన్‌లోడ్‌లు ఉన్నాయి.కొత్త యాడ్‌వేర్ మాడ్యూల్‌ ను కలిగి మరికొన్ని యాప్‌లను కూడా సెక్యూరిటీ కంపెనీ గుర్తించింది.ఈ మాల్వేర్ ద్వారా ప్రభావితమైన యాప్‌లలో బ్లూటూత్ డివైజ్ ఆటో కనెక్ట్, బ్లూటూత్, Wi-Fi, USB డ్రైవర్, వాల్యూమ్, మ్యూజిక్ ఈక్వలైజర్ ఉన్నాయి.ఈ మూడు యాప్‌లు 1.15 మిలియన్ల సార్లు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో ఇన్‌స్టాల్ అయినట్టు కంపెనీ గుర్తించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube