Chandra Babu : వైసీపీని ఓడించి ఏపీని కాపాడుకోవాలి..: చంద్రబాబు

అనంతపురం జిల్లా( Anantapuram District ) బుక్కరాయసముద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రోడ్ షో నిర్వహించారు.వైసీపీ పాలనలో పెట్రోల్, డీజిల్ తో పాటు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయన్నారు.

 Defeat Ycp And Save Ap Chandrababu-TeluguStop.com

ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయిందని విమర్శించారు.ఎస్సీ, బీసీలకు జగన్ ( Jagan ) అన్యాయం చేశారన్న చంద్రబాబు తమ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొస్తానని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలు సహా అన్ని కులాలకు న్యాయం చేస్తామని తెలిపారు.అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేశారని, రాయలసీమకు( Rayalaseema ) సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.

అయితే ఈ సారి రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను మార్చేవని పేర్కొన్నారు.ఈ క్రమంలో వైసీపీని ఓడించి ఏపీని కాపాడుకోవాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube