Chandra Babu : వైసీపీని ఓడించి ఏపీని కాపాడుకోవాలి..: చంద్రబాబు
TeluguStop.com
అనంతపురం జిల్లా( Anantapuram District ) బుక్కరాయసముద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రోడ్ షో నిర్వహించారు.
వైసీపీ పాలనలో పెట్రోల్, డీజిల్ తో పాటు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయన్నారు.ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయిందని విమర్శించారు.
ఎస్సీ, బీసీలకు జగన్ ( Jagan ) అన్యాయం చేశారన్న చంద్రబాబు తమ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొస్తానని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలు సహా అన్ని కులాలకు న్యాయం చేస్తామని తెలిపారు.అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేశారని, రాయలసీమకు( Rayalaseema ) సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.
అయితే ఈ సారి రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను మార్చేవని పేర్కొన్నారు.
ఈ క్రమంలో వైసీపీని ఓడించి ఏపీని కాపాడుకోవాలని వెల్లడించారు.
ముఖంపై నల్ల మచ్చలను పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసం!