పొద్దు పొద్దున్నే తిక్కతిక్కగా మాట్లాడిన దీప్తి సునైనా.. నాకు ఆకలేస్తే తింటానంటూ వంకర సమాధానం?

కొందరు తిక్క తిక్క సమాధానం చెబుతూ జనాలతో మాటలు పడిపించుకుంటారు.అసలు సంబంధంలేని మాటలు మాట్లాడుతూ అందరి నోట్లో నానుతుంటారు.

అసలు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతారో తెలీదు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం బాగా చిరాకుగా అనిపిస్తాయి.అలా తాజాగా దీప్తి సునయన మాటలు కూడా బాగా చిరాకు తెప్పించాయి.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.దీప్తి సునయన గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.

ఎందుకంటే ఈమె తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.పైగా తనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

Advertisement

డబ్స్మాష్ వీడియోలతో అందరి దృష్టిలో పడిన దీప్తి సునయన మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.అలా యూట్యూబ్ లలో కూడా షార్ట్ ఫిలిమ్స్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

దీంతో రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.ఇక బిగ్ బాస్ తర్వాత కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది దీప్తి.

యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ బిజీగా మారింది.అయితే ఈమె వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

మరో యూట్యూబర్ షణ్ముఖ్ ను లవ్ చేసి బ్రేకప్ చెప్పి అందరి దృష్టిలో పడింది.ఇక బ్రేకప్ తర్వాత కూడా ఇంకా ఎనర్జీగా మారింది దీప్తి సునయన.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.

Advertisement

అప్పుడప్పుడు సెల్ఫీ వీడియోస్ కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.ఇక తను తీయించుకున్న ఫోటోషూట్లను కూడా బాగా షేర్ చేయించుకుంటుంది.

అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో చిల్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను.వారితో కలిసి ట్రిప్స్ కెళ్ళిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెట్టేస్తూ ఉంటుంది.

ఇక ఇటీవలే తను కొత్త ఇల్లును కొనుగోలు చేయగా గృహప్రవేశం చేసి వాటి ఫోటోలను కూడా బాగా పంచుకుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే.ఈ మధ్య ఈమె బాగా వర్కౌట్లు చేసిన సంగతి తెలిసిందే.ఇక జిమ్ము నుంచి బయటికి వచ్చాక ప్రతిరోజు ఏదో ఒక సెల్ఫీ వీడియో షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా కూడాజిమ్ము నుంచి బయటికి రాగానే ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో పొద్దు పొద్దున్నే తినే ఫుడ్ ఐటమ్స్ వాసన వస్తుంది అంటూ.అయితే అందరికీ ఆకలి వేస్తే ఏం చేస్తారో కానీ నాకు ఆకలేస్తే మాత్రం తింటాను అంటూ వంకర సమాధానం చెప్పింది.

దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్స్ పొద్దు పొద్దున్నే తిక్క తిక్కగా మాట్లాడుతుంది అంటూ అసలు ఏం మాట్లాడుతుందో తనకైనా అర్థమవుతుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు