తెలుగు యూత్ ఆడియన్స్ కి.ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే యూత్ కి సుపరిచితులు అయిన దీప్తి సునయన మరియు షణ్ముఖ్ జస్వంత్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే.
ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమను అంగీకరించి పెళ్లి చేసేందుకు ఓకే చెప్పాయి.ఇద్దరు ప్రేమ జంటగా కాకుండా రియల్ జంట అన్నట్లుగా సోషల్ మీడియాలో సందడి చేయడంతో పాటు పలు టీవీ కార్యక్రమాల్లో కూడా హడావుడి చేశారు.
పెద్ద ఎత్తున టీవీ కార్యక్రమాల్లో వీళ్ళ ప్రేమ వ్యవహారం గురించి ప్రచారం జరగడంతో సోషల్ మీడియా నుండి ప్రధాన మీడియాకు వీళ్ళ యొక్క ప్రచారం పాకింది.ఏం జరిగిందో ఏమో కానీ బ్రేకప్ అయ్యారు.
ఆ సమయంలో ఇద్దరు కూడా వేరు వేరు ప్రాజెక్టులతో ఇద్దరు కలిసి చేసే ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండే వారు.కవర్ సాంగ్స్ మొదలుకొని వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ఇలా ఎన్నో చేస్తూ బిజీగా కనిపించేవారు.
కానీ ఇప్పుడు దీప్తి సునయన పెద్దగా బిజీ అయినట్లు కనిపించడం లేదు.
గతంలో మాదిరిగా వరుసగా కవర్ సాంగ్స్ చేయడానికి ఆమె ఇష్టపడడం లేదు, అంతే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లో కూడా అవకాశం వస్తే దాన్ని వదిలేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియాలో కూడా మునుపటి మాదిరిగా యాక్టివ్గా లేదు అంటూ ఆమెని ఫాలో అవుతున్న కొందరు చెప్పకనే చెబుతున్నారు.షన్ను తో విడి పోయిన తర్వాత ఆమె మరొకరితో స్నేహం మొదలు పెట్టింది అంటూ అప్పుడే పుకార్లు షికార్లు చేశాయి.
కానీ అది నిజం కాదని పలు సందర్భాల్లో ఆమె సన్నిహితులు తెలియజేశారు.ఆమె ఇప్పుడు లైఫ్ లో సెట్ అయ్యేందుకు పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఆమె గతంలో మాదిరిగా ప్రాజెక్టులతో బిజీగా లేదు అంటున్నారు.మరో వైపు షణ్ముఖ్ జస్వంత్ మాత్రం ఏదో ఒకటి చేస్తూ బిజీగానే కనిపిస్తున్నాడు.ఈ మొత్తం బ్రేకప్ వ్యవహారంలో దీప్తి సునయన యొక్క నటన మరియు ఆమె యొక్క సోషల్ మీడియా సందడిని ఆమె అభిమానులు మిస్ అవుతున్నారు.