పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కే.అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఆశక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ సరసన చేయడం కోసం కొత్త హీరోయిన్ కావాలని నాగ్ అశ్విన్ భావించారట.
ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాకూర్ నుఎంపిక చేసాము అయితే అదే సమయంలో డైరెక్టర్ హనురాగవపూడి సీతారామం సినిమా కథతో తమ వద్దకు వచ్చారని కథ మొత్తం విన్నటువంటి ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఈ సినిమా కథకు మృణాల్ ఠాకూర్ అయితే కచ్చితంగా సరిపోతుందని కావాలంటే మీరు ఆమెను తీసుకోండి ప్రాజెక్ట్ కే సినిమా కోసం మరొక హీరోయిన్ ప్రయత్నిస్తాము అంటూ ఈయన తెలిపారట.

ఇలా ప్రాజెక్టుకే కోసం ఎంపిక చేసుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ కుసీతారామం సినిమా అవకాశం రావడంతో ప్రాజెక్టు కే సినిమాలో దీపికా పదుకొనే నటిస్తున్నారని ఈ సందర్భంగా అశ్వినీ దత్ తెలిపారు.ఇక సీతారామం సినిమాని కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ తన కుమార్తె స్వప్న దత్ సంయుక్తంగా నిర్మించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.