మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అవసరం లేదు ఈమె కెరియర్ ను యాంకర్ గా ప్రారంభించినప్పటికీ నటనపై మక్కువతో వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.ఇలా వెండితెరపై సక్సెస్ కాలేని నిహారిక అనంతరం వివాహం చేసుకొని సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో నిర్మాతగా మారిపోయారు.
ఇలా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారికం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇందులో ఈమె ఏకంగా బాలీవుడ్ నటి అలియా భట్ నటించిన గంగుబాయ్ కతియ వాడి గెటప్ లో తయారయ్యి ఒక వీడియో చేశారు.
ఇలా తెల్ల చీర కట్టుకొని లిప్ స్టిక్ వేసి చేతిలో బ్యాగ్ పట్టుకొని అచ్చం అలియా భట్ ను తలపించేలా ఈమె ముస్తాబయి ఓ వీడియో చేశారు.అయితే పార్టీలో భాగంగా నిహారిక ఇలా తయారైనట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.గంగూని ఛానెలింగ్ చేస్తుంది.మీకు తెలుసో, తెలియదో, నేను ఇలాంటి కాస్ట్యూమ్స్ పార్టీలను ఇష్టపడతానని తెలిపింది. ఇక ఈ వీడియోలో తనని ఇద్దరు వెనక ఆటపట్టిస్తుంటారు వారి ఉద్దేశించి నా వెనుక ఉన్న కోతులను ఏమాత్రం పట్టించుకోకండి అని పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ స్పందిస్తూ సూపర్ అంటూ కామెంట్ చేశారు.మొత్తానికి నిహారిక గంగుబాయ్ గెటప్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి.








