ఈమధ్య ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అయిపోతున్నారు.తమ సొంత టాలెంట్ తో డాన్సులను చేస్తూ ఓ గుర్తింపునే తెచ్చుకుంటున్నారు.
ఆ మధ్య ప్రభుత్వం బ్యాన్ చేసిన టిక్ టాక్ యాప్ గురించి అందరికీ తెలిసిందే.దాని ద్వారా ఎందరో వినియోగదారులు స్టార్స్ గా ఎదిగారు.
అంతే కాకుండా సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చుకున్నారు.ఇక ఆప్ బ్యాన్ చేసిన తర్వాత కూడా వారి టాలెంట్ ను మాత్రం ఆపలేదు.
యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా తమ టాలెంట్ మళ్లీ మొదలు పెట్టారు.ఇక టిక్ టాక్ నుంచి స్టార్ గా ఎదిగిన ఓ అమ్మాయి సారంగదరియా పాటకు ట్రోలింగ్ కు ఎదురైంది.
ఆమె ఎవరో కాదు టిక్ టాక్ లో తన అందంతో, పొట్టి పొట్టి డ్రెస్సులతో, పిచ్చెక్కించే డాన్సులతో ఆకట్టుకున్న టిక్ టాక్ స్టార్ దీపిక పిల్లి.ఆమె డాన్స్ కు లక్షలాది అభిమానులను సంపాదించుకుంది.
ఇదిలా ఉంటే ఇటీవలే ఆమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న లవ్ స్టోరీ సినిమా లో ఇటీవల విడుదలైన సారంగదరియా పాటకు డాన్స్ చేసింది.ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఇది చూసిన నెటిజనులు ఆమెపై మండిపడ్డారు.

ఇలాంటి పాటకు గుడిలో డాన్స్ చేయడం ఏంటి అని కొందరు మండిపడగా.మరికొందరు తన డాన్స్ ను చూసి తెగ మెచ్చుకున్నారు.సూపర్ డాన్సింగ్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఇక ఈమె ఎప్పటికప్పుడు కొత్తగా విడుదలైన పాటలను వెంటనే డాన్స్ చేసి నెట్టింట్లో పెట్టేస్తుంది.ఇదిలా ఉంటే దీపిక పిల్లి ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఢి డాన్స్ షో లో యాంకర్ గా చేస్తుంది.