రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రతి ఒక్కరిని సంతోషపర్చ లేక పోయింది.కొందరు ఈ సినిమా పట్ల అసహనం తో ఉన్నారు.
వారు ఎవరు అనుకుంటున్నారా… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అభిమానులు.అవును నిజంగానే వారు చాలా అసంతృప్తి తో ఉన్నారు.
కనీసం ఒలీవియా కు దక్కిన రోల్ కూడా ఆలియా కు దక్కలేదని వారు బాధ పడుతున్నారు.అంత పెద్ద స్టార్ హీరోయిన్ కేవలం పది నిమిషాలు చూపించి నిరాశ పరిచారు అంటూ ప్రతి ఒక్క ఆలియా అభిమాని కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా ఆలియా భట్ ని ఓ రేంజ్ లో ఊహించుకున్నాము.కానీ ఇలా ప్రాముఖ్యత లేని పాత్ర లో చూపించి ఏమాత్రం ఆకట్టుకోని మేకప్.
కాస్ట్యూమ్స్ లో ఆమెను చూపించి తమ యొక్క మనోభావాలు దెబ్బ తీశారంటూ తీవ్ర ఆగ్రహంతో రాజమౌళి పై సీరియస్ గా ఉన్నారు.
ఈ విషయమై ఆలియా కూడా రాజమౌళి పై చాలా ఆగ్రహం తో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఇదే విషయం ప్రాజెక్ట్ కే కూడా జరుగుతుందేమో అంటూ కొందరు దీపికా పడుకొనే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

సినిమా షూటింగ్ లో దీపికా పడుకొనే సన్నివేశాలు చాలానే ఉన్నా ఆమె సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేస్తారు అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆర్.ఆర్.ఆర్ సినిమా కు ఆలియా భట్ ఎలా అయితే అవమానం ఎదుర్కొందో అలాగే దీపికా పడుకొనే కూడా ప్రాజెక్ట్ కె సినిమా కు సంబంధించి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమో అని… అభిమానులమైన తాము తీవ్ర మనోవేదనకు గురి కావల్సి వస్తుందేమో అని ఇప్పటి నుండే వారు భయపడుతున్నారు.అయితే నాగ్ అశ్విన్ అలా ఏం చేయడని కొందరు నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.